రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్దేశించిన 21 రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్దేశించిన 21 రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

-కెమిస్ట్రీ ల్యాబ్ లు, ఆట స్థలాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-52 పీఎంశ్రీ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్స్ పని తీరుపై నివేదిక ఇవ్వాలని ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు ఆదేశాలు

-ప్లే గ్రౌండ్, ఫర్నిచర్ లేని పాఠశాలల వివరాలను సమర్పించండి

-10వ తరగతి విద్యార్థులకు వర్చువల్ తరగతుల బోధనకు ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించండి

-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్దేశించిన 21 రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

మంగళవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PMSHRI) అంశంపై మండల విద్యాశాఖ అధికారులు, PMSHRI స్కూల్స్ హెడ్ మాస్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ కన్వర్జెన్స్ సమావేశాన్ని నిర్వహించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PMSHRI) ప్రోగ్రాం కింద ఫేజ్ -1 &2 లో 52 పాఠశాలలను గుర్తించడం జరిగిందన్నారు.. ఫేజ్ -1 కింద రూ.1.24 కోట్లతో 8 కెమిస్ట్రీ ల్యాబ్ లు, 29 పాఠశాలల్లో 1.45 కోట్లతో ప్లే ఫీల్డ్ లను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు..వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు..పూర్తయిన పనులకు వెంటనే బిల్స్ అప్లోడ్ చేయాలని apwidc ఇంజనీర్లను ఆదేశించారు.. ఫేజ్ -2 కింద కూడా పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులను మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.అలాగే నిర్దేశించిన విధంగా 52 పాఠశాలల్లో త్రాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, ఇంటర్నెట్, ల్యాబ్ తదితర 21 రకాల వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఒక యాప్ ద్వారా సేకరించి తనకు పంపాలని కలెక్టర్ డీఈవో ను ఆదేశించారు..

52 పీఎంశ్రీ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్స్ పని తీరుపై కలెక్టర్ హెడ్మాస్టర్లను ఆరా తీశారు. కౌతాళం, పెద్దకడుబూరు, వెల్దుర్తి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో త్రాగునీటి సమస్య ఉందని, ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్లు కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు..52 పీఎంశ్రీ పాఠశాలల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ల పనితీరుపై ఏ ఈ లు వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ఎస్ ఈ ని ఆదేశించారు...అలాగే ఫర్నిచర్ లేని పాఠశాలల వివరాలను సమర్పించాలని హెడ్ మాస్టర్ లను ఆదేశించారు. ప్లే గ్రౌండ్ లేని పాఠశాలల హెడ్ మాస్టర్లు సంబంధిత ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లకు సమస్యకు ప్రతిపాదనలను ఇవ్వాలని, ప్రభుత్వ భూమిని గుర్తించి ఆట స్థలం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.. అలాగే NREGS కింద చేయగలిగిన పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పిడిని ఆదేశించారు.. అలాగే జిల్లా పరిషత్ పాఠశాలల్లో జిల్లా పరిషత్ నుండి చేయగలిగిన పనులను చేయాలని కలెక్టర్ జడ్పీ సీఈవో ను ఆదేశించారు..

10వ తరగతిలో ప్రతి విద్యార్థి పాస్ అయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

డిసెంబర్ లోపు సిలబస్ అంతా పూర్తి చేసి, జనవరి నుండి పరీక్ష లను దృష్టిలో పెట్టుకొని, ఆ దిశగా ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలను విద్యార్థులకు నేర్పించే విధంగా చర్యకు తీసుకోవాలని సూచించారు.పదవ తరగతి విద్యార్థుల కోసం త్వరలో సెంట్రల్ బేస్డ్ వర్చువల్ తరగతుల బోధనకు చర్యలు తీసుకుంటున్నామని, బాగా బోధించే వారు, ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.. ఆ దిశగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించాలని డీఈవో కు సూచించారు.. పాఠశాలల్లో బాగా రూపొందించిన టీచింగ్,లెర్నింగ్ మెటీరియల్ ను, బోధనా పద్ధతులను అందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేసుకోవాలని, అందుకోసం వాట్సప్ గ్రూప్ లను క్రియేట్ చేయాలని డీఈవో ను ఆదేశించారు..

సమావేశంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్, చల్లా కళ్యాణి, ఆర్డీవోలు సందీప్ కుమార్, భరత్ నాయక్, జడ్పీ సీఈవో నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-