రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు..
రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు..
బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు..
-ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.మల్లికార్జున గుప్తా
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాలమేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు అన్నీ పోలీసు స్టేషన్ ల పరిదిలో అవగాహన కార్యక్రమాలు ,ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలలో భాగంగా స్పీడ్ బ్రేకర్స్ ,ప్రమాద సూచికలు ఏర్పాటు చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శాంతిరామ్ కాలేజీ వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాని సందర్శించి నివారణ చర్యలలో బాగంగా టోల్ ప్లాజా అధికారుల సహాయంతో నాలుగు స్పీడ్ బ్రేకర్లు వేయడం మరియు తదుపరి ప్రమాదాలు జరగకుండా మరియు వాహనాల వేగాన్ని తగ్గించడానికి ఆ ప్రాంతాన్ని సర్వే చేయడం జరిగింది.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా రోడ్డు భద్రత నిభందనలు పాటించక ఎక్కువగా వాహనదారులు ,ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతూ ఎక్కువ ప్రాణా నష్టం మరియు గాయాల పాలౌతున్నారని,నంద్యాల టౌన్ రహదారులు పై రహదారి ప్రమాదాల నివారణ కొరకు బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రమాద సూచికలను ఏర్పాటు చేయడం జరిగిందని రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కావున ప్రజలు రోడ్డు భద్రత ,నిభందలు పాటించాలని, క్రాస్ రోడ్డుల వద్ద ప్రజలకు అవగాహన కొరకు ఏర్పాటు చేసిన సిగ్నల్ బోర్డ్ లను, స్పీడ్ బ్రేకర్స్ ను గమనించాలని, రహదారి ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురవటం వలన ప్రాణాలు కోల్పోతున్నారని, కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్లు , సీట్ బెల్ట్ ,రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ప్రమాద సమయాలలో ప్రాణాపాయం జరగకుండా కాపాడుకోగలుగుతారు.
ఆటోలలో పరిమితికి మించి ప్రయాణం చేయడం, డ్రైవర్ కు ఇరు ప్రక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవ్ చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, కావున ప్రజలు ఓకే ఆటోలో ఎక్కువమంది ప్రయాణించడం మానుకోవాలని, డ్రైవర్ కు ఇరుపక్కల కూర్చుని ప్రయాణించడం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించి ప్రయాణం చేయాలని తెలియజేశారు. ట్రాఫిక్ నియమని నిబంధనలు గురించి విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో స్కూలలో కాలేజీలలో రహదారి ప్రమాదాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలియజేశారు.రహదారి ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదములు జరగటం వలన మరణాలు అంగవైకల్యాలు సంభవిస్తున్నాయని కావున ప్రతి ఒక్కరూ వేగం వద్దు ప్రాణం వద్దు అనే విషయాన్ని గ్రహించి సురక్షితంగా గమ్యం చేరాలని తెలియజేశారు.