-Advertisement-

AP LAWCET Counselling: ఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..

Ap lawcet counselling AP LAWCET counselling 2024 AP LAWCET 2024 Ap lawcet eligibility AP LAWCET counselling Apply online AP LAWCET counselling dates
Peoples Motivation

AP LAWCET Counselling: ఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. 

20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్

ఏపీ లాసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్ ఖరారైంది. 

లాసెట్‌ అడ్మిషన్ల ప్రక్రియలో ఇప్పటికే ఆలస్యమైంది. 

AP LAWCET Counselling Ap lawcet counselling AP LAWCET counselling 2024 AP LAWCET 2024 Ap lawcet eligibility AP LAWCET counselling Apply online AP LAWCET counselling dates

ఏపీలో మూడేళ్లు, ఐదేళ్ళ ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్‌‌ను కన్వీనర్‌ విడుదల చేశారు.

 ముఖ్యమైన తేదీలు:-

• అక్టోబర్‌ 16 నుంచి 20 లోపు కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కన్వీనర్ సూచించారు. 

• అక్టోబర్‌ 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలు ఎంపిక చేసుకోవాలి 

• అక్టోబర్‌ 26న మార్పులు చేసుకోడానికి అనుమతిస్తారు.

• అక్టోబర్‌ 28న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

• లాసెట్‌లో సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్‌ 29, 30 తేదీల్లో ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 జూన్ 27వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. మిగిలిన పీజీ కోర్సులు పూర్తైన తర్వాత లాసెట్‌ అడ్మిషన్లు చేపట్టాలని భావించడంతో ఆలస్యమైంది. మరోవైపు తెలంగాణలో చూస్తే లాసెట్ ప్రవేశాల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నడుస్తోంది.

గతేడాది చూస్తే ఏపీలో లాసెట్ కౌన్సెలింగ్ నవంబర్‌లో ప్రారంభమైంది. ఈసారి అక్టోబర్‌లోనే నిర్వహిస్తున్నారు. ఏపీ లాసెట్‌ను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు. ఎంట్రెన్స్ లో పాస్ అయిన వారితో పాటు మేనేజ్ మెంట్ కోటాలో చేరాలనుకునే చాలా మంది అభ్యర్థులు... కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు.

లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించాలంటే ఆయా కాలేజీలకు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఏపీలో కొన్నికాలేజీల అనుమతుల ప్రక్రియ కొనసాగడంతో షెడ్యూల్‌ విడుదలలో జాప్యం జరిగింది.

లాసెట్ ర్యాంక్ చెక్ చేసుకోండిలా…

https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

• Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

• Registration Number , Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.

• గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

• ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.

• అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

ఈసారి ఫలితాలను గమనిద్దాం..

రెండేళ్ల పీజీ కోర్సులో(LLM) పురుషులు 99.51 శాతం, స్త్రీలు 99.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 91.28 శాతం, స్త్రీలు 86.26 శాతం,

 ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 81.91 శాతం, స్త్రీలు 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Comments

-Advertisement-