-Advertisement-

వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

• వరుసగా మూడవ నెలలోనూ పెరుగుదల...

• పండగ సీజన్ ముందు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్...

• ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి...

• రూ.50 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన...

• పెంచిన ధరలు అక్టోబర్ 1వ తేదీ నుంచే అమలు...

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

దేశవ్యాప్తంగా పండుగల ముందు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఇది చేదువార్తే. వరుసగా మూడవ నెల అక్టోబర్‌లో కూడా గ్యాస్ ధర పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.50 మేర పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు (అక్టోబర్ 1) నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1802 నుంచి రూ.1850.50కి, ముంబైలో రూ.1644 నుంచి రూ.1692.50కి, చెన్నైలో రూ.1855 నుంచి రూ.1903కి పెరిగాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి.  నవరాత్రి, దసరా, దీపావళి వంటి పండుగల వేళ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఎదురుదెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గృహ వినియోగదారులకు ఊరట...

కాగా 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.

Comments

-Advertisement-