Railway Jobs: ఐటీఐ, ఇంటర్ అర్హతతో రైల్వేలో 14,298 పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు
Railway Jobs: ఐటీఐ, ఇంటర్ అర్హతతో రైల్వేలో 14,298 పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే శాఖ 14,298 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 959 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రైల్వే బోర్డు నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే శాఖ 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం... వాస్తవానికి వివిధ రైల్వే జోన్లలోని టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం మార్చి నెలలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 9,144 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొంది. తరువాత ఈ పోస్టుల సంఖ్యను 14,298కు పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవాళ్లు, తమ అప్లికేషన్‌లో పోస్టుల ప్రాధామ్యాలు మార్చుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది. అలాగే కొత్త వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. కనుక అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు అక్టోబర్ 2 నుంచి 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం
పోస్టుల వివరాలు:-
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ (ఓపెన్ లైన్) - 1,092 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్-III (ఓపెన్ లైన్) - 8,052 పోస్టులు
టెక్నీషియన్ గ్రేడ్-III (వర్క్‌షాప్ అండ్ పీయూఎస్) - 5,154 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య - 14,298.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు:-
యూఆర్ - 6171
ఓబీసీ - 3469
ఈడబ్ల్యూఎస్- 1481
ఎస్టీ - 1152
ఎస్సీ - 2014
ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా పోస్టుల వివరాలు :-
సికింద్రాబాద్ - 959
భువనేశ్వర్ - 166
బెంగళూరు - 337
చెన్నై - 2716
తిరువనంతపురం - 278
అహ్మదాబాద్ - 1015
అజ్‌మేర్ - 900
భోపాల్ - 534
బిలాస్‌పూర్ - 933
చండీగఢ్ - 187
గువాహటి - 764
జమ్మూ అండ్ శ్రీనగర్ - 721
కోల్‌కతా - 1098
మాల్దా - 275
ముంబయి - 1883
ముజఫర్‌పూర్ - 113
పట్నా - 221
ప్రయాగ్‌రాజ్ - 338
రాంచీ - 350
సిలిగురి - 91
గోరఖ్‌పూర్ - 419
విద్యార్హతలు:-
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ :- బీఎస్సీ, బీఈ/ బీటెక్, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణలై ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-III :- మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్/ ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్/ మెకానిక్/ ఫిట్టర్/ వెల్డర్/ పెయింటర్ జనరల్/ మెషినిస్ట్/ కార్పెంటర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ మెషినిస్ట్/ మెకానిక్ / మెకానిక్ మెకాట్రానిక్స్/ మెకానిక్ డీజిల్/ మెకానిక్ (మోటార్ వెహికిల్)/ టర్నర్/ ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్/ గ్యాస్ కట్టర్/ హీట్ ట్రీటర్/ ఫౌండ్రీమ్యాన్/ ప్యాటర్న్ మేకర్/ మౌల్డర్ తదితరాలు) లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్) ఉత్తీర్ణలై ఉండాలి.
వయోపరిమితి:-
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18-36 ఏళ్లు మధ్యలో ఉండాలి;
టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లపాటు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి.
మహిళలు, ఈబీసీలు, మాజీ సైనికోద్యోగులు, ట్రాన్స్‌జెండర్‌లు, మైనారిటీలు, ఎస్టీ, ఎస్సీలు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
జీతభత్యాలు
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.29,20 వరకు జీతం ఇస్తారు.
టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 అక్టోబర్ 2
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 16
దరఖాస్తు సవరణ తేదీలు : 2024 అక్టోబర్ 17 నుంచి 21 వరకు
ఎంపిక విధానం
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ ప్రశ్నపత్రం - జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు - 10 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (15 ప్రశ్నలు - 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (20 ప్రశ్నలు - 20 మార్కులు), మ్యాథమెటిక్స్ (20 ప్రశ్నలు - 20 మార్కులు), బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (35 ప్రశ్నలు - 35 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
టెక్నీషియన్ గ్రేడ్-III ప్రశ్నపత్రం - మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు - 25 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు - 25 మార్కులు), జనరల్ సైన్స్ (40 ప్రశ్నలు - 40 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు - 10 మార్కులు) అంశాలపై ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తం మార్కులు 100.
👉దరఖాస్తు కొరకు ఇక్కడ RRB వెబ్సైట్ పై క్లిక్ చేయండి http://www.rrbapply.gov.in