హ్యూమన్ రైట్స్" పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హ్యూమన్ రైట్స్" పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్, ఐ.పీ.ఎస్
నేషనల్/స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ యొక్క అసోసియేషన్, అనుబంధ సంస్ధల అధికారులమని కాల్స్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ నేరాలకు గురికాకుండా ఉండొచ్చని జిల్లా ఎస్పీ తెలియచేసారు. కొందరు కేటుగాళ్లు హ్యూమన్ రైట్స్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్లు, ఫేక్ ఐడి కార్డ్ లు, సోషల్ మీడియా గ్రూపులు సృష్టించి ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి, ఆ సంస్థల అధికారులమని ఫోన్ చేసి ఏదైనా సేవల కోసం లేదా కేసును పరిష్కరించడానికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయటం లేదా మీరు ఫలానా తప్పు చేశారని బెదిరించడం, మీ మీద కేసు నమోదు అయిందని వాయిస్/వీడియో కాల్ చేసి ముందుగానే సేకరించిన మీ వివరాలన్నీ చెప్పి భయపెడతారని, ఈ కేసు నుండి బయటపడాలంటే కొంత అమౌంట్ ట్రాన్సఫర్ చేయాలని మీకు ఆర్థిక నష్టాన్ని కల్గిస్తారని తెలిపారు.
హ్యూమన్ రైట్స్ సంభందించి అసోసియేషన్ కానీ, అనుబంధ సంస్ధలు కానీ ఉండవని, కావున ప్రజలు అలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు ట్రాన్సఫర్ చేయమన్నా లేక బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ , OTP మరియు ఇతర పర్సనల్ వివరాలు అడిగితే ఇవ్వొద్దని జిల్లా ఎస్పీ సూచించారు.
కావున ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు, అది నిజమేనా కాదా నిర్దారించుకోవాలని, అధికారిక వెబ్‌సైట్లు, విశ్వసనీయ మీడియాను మాత్రమే రిఫరెన్స్ చేయాలని, తెలియని వ్యక్తులకు, వెబ్‌సైట్లకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరాదని, మీ అన్ని అకౌంట్లకు విభిన్నమైన, స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ ఉపయోగించాలని, అనుమానితమైన ఏదైనా విషయం గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
హ్యూమన్ రైట్స్ అనే పవిత్రమైన పదాన్ని దుర్వినియోగం చేసే మోసపూరితమైన వ్యక్తులను గుర్తించి, వారి మోసాలు, కుట్రలను అడ్డుకోవడం మనందరి బాధ్యత. అవగాహన, అప్రమత్తతతో ఉండడం ద్వారా మనం సైబర్ నేరాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.