Cyber Security: సైబర్ నేరానికి గురైతే గంటలోపే 1930 కి డయల్ ఫోన్ చేసి సమాచారం అందించండి
Cyber Security: సైబర్ నేరానికి గురైతే గంటలోపే 1930 కి డయల్ ఫోన్ చేసి సమాచారం అందించండి
• ఇంటర్మీడియట్ , డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ , అధ్యాపకులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
• యువతను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలి.
-జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్
అనవసర లింకులు క్లిక్ చేయవద్దని, హానీ ట్రాప్, మీ అబ్బాయి కిడ్నాప్ అని, కొరియర్ వచ్చిందని , లాటరీ తగిలిందని, డిజిటల్ అరెస్టు పేరుతో వీడియో కాల్స్ చేస్తూ సైబర్ నేరగాళ్ళు పలు మోసాలకు పాల్పడుతున్నారని జాగ్రత్త గా ఉండేవిధంగా విద్యార్ధులకు అవగాహన చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ తెలిపారు.
ఈ సంధర్బంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని వివిధ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ , అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు చేశారు. ఎమైనా సమస్యలు వచ్చినప్పుడు పోలీసులు ఎలా స్పందిస్తున్నారన్న విషయాల గురించి జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.
కళాశాలల వద్ద విద్యార్దులు సైలెన్సర్ లేకుండా బైక్ లు నడపడం, ట్రాఫిక్ సమస్యలు, సిసి కెమెరాలు, కళాశాలల వద్ద పోలీసు గస్తీ వంటి విషయాల గురించి ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కి విన్నవించారు. ఈ సమస్యల పై జిల్లా ఎస్పీ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ మాట్లాడుతూ...
యువత పాత్ర సమాజంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. విద్యార్ధులకు మనం ఏమి నేర్పితే వాళ్ళు అది నేర్చుకుంటారన్నారు. వారు భవిష్యత్తు పై దృష్టి సారించాలన్నారు. వారి పై ఆధారపడ్డ తల్లితండ్రుల గురించి ఆలోచించే విధంగా విద్యార్ధులు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా చేయాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా , మంచి నడవడిక పైనే వారి జీవితం ఆధారపడి ఉందన్నారు. యువతను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. మైనర్లు నిర్లక్ష్యంగా , అతివేగంగా బైక్ లు నడపడం, రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం , డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా బైక్ నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, బైక్ సైలెన్సర్లు లేకుండా అధిక శబ్ధం చేస్తూ నడపడం చట్ట రీత్యా నేరమన్నారు.
బైక్ సైలెన్సర్లు తీసి ఎక్కువ శబ్దం చేస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న యువకుల విడియోలు తీసి కర్నూలు జిల్లా పోలీసు వాట్సప్ నెంబర్ 7777877722 లేదా 9121101100 కు పంపించాలన్నారు. హానీ ట్రాప్, పోర్న్ సైట్లు చూస్తున్నారంటూ బెదిరించి, అరెస్టులు లేకుండా ఉండాలంటే పైన్ కట్టాలని , కొరియర్ పేరు చెప్పి కేసు పెట్టెస్తాం అని, లాటరీ తగిలిందని, పెట్టుబడులు పెట్టండి డబల్ చేస్తామని, అపరిచితుల నుండి వచ్చే వాట్సాప్ కాల్స్ చేస్తూ , వీడియో కాల్స్ చేస్తూ అమాయకులైన ప్రజలను సైబర్ నేర గాళ్ళు సైబర్ నేరాలకు గురిచేస్తున్నారన్నారు. జిల్లాలో చాలా మంది ప్రజలు సైబర్ నేరాలకు గురై కోట్ల రూపాయలు నష్టపోయారన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సైబర్ నేరం బారిన పడితే వెంటనే ఒక గంట లోపే 1930 కి సమాచారం అందించాలన్నారు. సైబర్ క్రైమ్ పోర్టల్ లో www.cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, డిసిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు, కమాండ్ కంట్రోల్ సిఐ శివశంకర్ , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు , సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల, ఉస్మానియా కళాశాల, కెవిఆర్ కళాశాల, సెయింట్ జోసఫ్ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, కర్నూలు డిగ్రీ కళాశాల, నారాయణ జూనియర్ కళాశాల, సాయిక్రిష్ణ డిగ్రీ కళాశాల, కోల్స్ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.