-Advertisement-

పుట్ట్ పాత్ రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేస్తే ఇకపై జరిమానా తప్పదు..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

పుట్ట్ పాత్ రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేస్తే ఇకపై జరిమానా తప్పదు..

రోడ్డుకి ఇరువైపులా వ్యాపారాలు చేస్తూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై 55 మందికి ఒక్కొక్కరికి రూ.500/- ల చొప్పున మొత్తం రూ.27,500/- ల జరిమానా..

తీర్పును వెలువరించిన 3వ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తిరుపతి జడ్జ్ సంధ్యారాణి

ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలి. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.

TIRUPATI DISTRICT SP L SUBBARAYUDU

 తిరుపతి పట్టణ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డుకి ఇరువైపులా వాహనాలు మరియు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగించే వ్యాపారులపై కేసులను నమోదు చేసి 55 మంది ముద్దాయిలను 3 వ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తిరుపతి నందు హాజరు పరచగా గౌరవ జడ్జి శ్రీమతి సంధ్యారాణి గారు ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున మొత్తం 55 మందికి రూ.27,500/- జరిమానా విధించారు.

 తిరుపతి ట్రాఫిక్ పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ ఎల్ . సుబ్బరాయుడు ఐపీఎస్., అభినందించినారు. తిరుపతి నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., ఆదేశాల మేరకు ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణచారి, కేసుల వివరాలు వెల్లడించారు.

Comments

-Advertisement-