భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించిన-జిల్లా ఎస్పీ
భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించిన-జిల్లా ఎస్పీ
• 110 బైక్ సైలెన్సర్లు ధ్వంసం.
• స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సైలెన్సర్ల ను సీజ్ చేసిన కర్నూలు పోలీసులు.
• ట్రాఫిక్ సమస్యల పై దృష్టి సారిస్తాం.
- కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్
గురువారం కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం కొండారెడ్డి బురుజు దగ్గర అధిక శబ్దం కలిగించే 110 సైలెన్సర్స్ లను కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయించారు. ఎవరైనా మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు పట్టణంలో గత 4 రోజులలో కర్నూలు ట్రాఫిక్ పోలీసులు 60 సైలెన్సర్లు, కర్నూలు పట్టణ పోలీసులు 50 సైలెన్సర్లను సీజ్ చేయడం జరిగిందన్నారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మీడియా తో మాట్లాడారు.
కర్నూలు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్లను అమర్చుకొని 80 డెసిబల్స్ కంటే అధిక శబ్దము చేస్తున్న బైక్ లను సైంటిఫిక్ పద్దతిలో నాయిస్ పొల్యుషన్ సామాగ్రిని ఉపయోగించి పట్టుకున్నామన్నారు.
ఇటువంటి చర్యలు పునరావృతమైన ఆ వాహన దారులకు జరిమానాలు విధించడం , వారి వాహనాలు సీజ్ చేయడం , కేసులు నమోదు చేయడం వంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
కర్నూలు వెంకటరమణ కాలనీ, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వృద్దులను, రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ అధిక శబ్దం చేసే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు.
ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు ఉన్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
అధిక శబ్దం చేసే సైలెన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు. అధిక శబ్దం చేసే సైలన్సర్లను వాహనాలకు విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ ల పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు.
తల్లిదండ్రులు మైనర్ల కు వాహనాలు ఇవ్వకుండా కౌన్సిలింగ్ చేస్తామని , ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్, కర్నూలు పట్టణ సిఐలు మన్సురుద్దీన్, నాగరాజారావు, రామయ్యనాయుడు, మురళీధర్ రెడ్డి ఉన్నారు.