రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

•వన్యప్రాణుల సంరక్షణకు ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు  

•టోల్ ఫ్రీ నెంబర్: 18004255909 

•మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

‘వన్యప్రాణులను వేటాడటం... చంపడం... అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం. భూమ్మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కు ఉంద’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ ను విడుదల చేశారు. వన్య  ప్రాణుల వేట, అక్రమ రవాణా సమాచారం ఉంటే యాంటీ పోచింగ్ సెల్ కు తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషేదం. ఎవరైనా వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదన నాశనం చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటాం. 

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

•ఇది మంచి ప్రభుత్వం... బాధ్యతగల ప్రభుత్వం 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వంతోపాటు బాధ్యత గల ప్రభుత్వం. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు విధులకు కట్టుబడి ఉన్నారు. చిత్తూరు జిల్లా కౌండిన్య అభయారణ్యంలో ఇటీవల చిరుత పులిని చంపిన నిందితులను మూడు రోజుల్లో పట్టుకొని రిమాండ్ కు తరలించారు. అలాగే పల్నాడు జిల్లాలో అరుదైన జంతువును చంపిన నిందితులను రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, చంపినా, అక్రమ రవాణాకు పాల్పడినా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురండి. 18004255909 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించండి. అలాగే అటవీ సంపదను నాశనం చేసినా, అక్రమ మైనింగ్ కు పాల్పడిన అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాల”న్నారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము, పీసీసీఎఫ్ చిరంజీవ్ చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎ.కె. నాయక్, శరవణన్, రాహుల్ పాండే, శాంతిప్రియ పాండే తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-