ప్రజలకు భద్రత కల్పించడం, రక్షించడంతో పాటు ప్రాణాలను నిలబెట్టడం మా కర్తవ్యం
General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
By
Peoples Motivation
ప్రజలకు భద్రత కల్పించడం, రక్షించడంతో పాటు ప్రాణాలను నిలబెట్టడం మా కర్తవ్యం
•పోలీసు అమర వీరుల త్యాగాల స్ఫూర్తితో రక్తదానం చేసిన పలువురు పోలీసు అధికారులు, విద్యార్థులు
-జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం
-జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS
ప్రజలకు భద్రత కల్పించడం, రక్షించడంతో పాటు ప్రాణాలను నిలబెట్టడం మా కర్తవ్యమని జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాళ్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు, వారి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతీ ఏటా అక్టోబర్ అక్టోబర్ 21 నుండీ 31 వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవారు చేపట్టామన్నారు. ఇప్పటికే పోలీసుల దైనందిన సేవలలో భాగంగా వినియోగించే ఆయుధాలు, పరికరాలను ప్రదర్శనలో ఉంచి విద్యార్థులకు అవగాహన చేశామన్నారు. రక్తదాన కార్యక్రమాలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు నిర్వహించామన్నారు. రక్తదానం చేయడం అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ కల్పించడమేనని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ప్రసవాలు, ఆపరేషన్ల సమయంలో రక్తం పాత్ర కీలకం అవుతుందన్నారు. అలాంటి ఆపద సమయంలో మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం అదృష్టంగా భావించాలన్నారు. ఈనేపథ్యంలో రక్తదానం చేయడంపై ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 162 మంది రక్తదానం చేశారు. వీరిలో సి.ఐ లు ధరణి కిశోర్, క్రాంతికుమార్, శ్రీకాంత్ , కనుమూరి సాయినాథ్, రఘు ప్రసాద్ , ఆర్ ఐ రెడ్డెప్ప లు రక్తదానం చేశారు. అంతేకాకుండా... సివిల్, ఏ.ఆర్ , స్పెషల్ పార్టీ మరియు హోంగార్డులు మరియు వివిధ కళాశాలల విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి, అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు, పోలీసు డాక్టర్ వెంకటేష్ ప్రసాద్, జిల్లా సర్వజన ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కిశోర్, డాక్టర్ రామస్వామి, బ్లడ్ బ్యాంకు సిబ్బంది, సి.ఐ లు ధరణీకిశోర్, క్రాంతికుమార్, కనుమూరి సాయినాథ్, శ్రీకాంత్, శాంతిలాల్, శేఖర్, రఘుప్రసాద్, హరినాథ్, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, ఎస్పీ సి.సి ఆంజనేయ ప్రసాద్, ఎస్సైలు వెంకట కృష్ణ, శ్రీనివాసులు, ఆర్ ఎస్ ఐ లు జాఫర్, మగ్బూల్, రమేష్ నాయక్, ముస్తఫా, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ ఎస్ ఐ జాఫర్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, లక్ష్మినారాయణ, ఆనంద్, వివిధ కళాశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు, హోంగార్డుల కుటుంబాలకు రూ. 2.30 లక్షలు అందజేత
గడచిన ఏడాది కాలంలో... విధి నిర్వహణలో మృతి చెందిన 11 మంది పోలీసులు, హోంగార్డుల కుటుంబాలకు జిల్లా ఎస్పీ పి.జగదీష్ IPS చేతుల మీదుగా రూ. 2.30 లక్షలను చెక్కుల రూపంలో అందజేశారు. వీరిలో 08 మంది పోలీసు కుటుంబాలు... ముగ్గురు హోంగార్డుల కుటుంబ సభ్యులు ఉన్నారు.
Comments