కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల ను అడ్డుకుంటాం..
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల ను అడ్డుకుంటాం..
సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్
దేవనకొండ, అక్టోబర్ 19 (పీపుల్స్ మోటివేషన్):-
దేవనకొండ మండలంలో కప్పట్రాళ్ల మరియు పరిసర ప్రాంతాల్లోని అటవీ మరియు బంజరు భూములలో ప్రభుత్వం తలపెట్టిన యూనియన్ తవ్వకాలను ప్రజల తరఫున ప్రజలతో కలిసి అందరి భాగస్వామ్యంతో అడ్డుకుంటామని ప్రజల జీవితాలతో చెలగాటమాడే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ పేర్కొన్నారు
యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చారని వార్తల నేపథ్యంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ,నారాయణ,జిల్లా నాయకులు వీరశేఖర్ తో కూడిన పార్టీ బృందం శనివారం నాడు కప్పట్రాళ్ల మరియు గ్రామ రెవెన్యూ పరిధిలోని పొలాలను పరిశీలించి కప్పట్రాళ్ల లో గ్రామస్తులతో మాట్లాడారు ప్రభుత్వాలు ప్రజల బాగోగులు చూడాలి గాని కార్పొరేట్ సంస్థ లాభాల కోసం ప్రయత్నం చేయరాదన్నారు, యురేనీయం తవ్వకాల వలన కప్పట్రాళ్ల మరియు పరిసర ప్రాంతాలలోని అనేక గ్రామాల ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఉండదని యురేనియం ఆక్సిజన్లో కలిస్తే తీవ్ర మార్పులు జరిగి వాతావరణం నీరు కలుషితమై పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉందని ప్రమాదకరంగా ఉన్న యూనియన్ తమకాల ఆలోచనలు ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాలు నిర్ధారణ కోసం తవ్వకాలకు అనుమతి లభించిందన్న సమాచారంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్ల తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు సమాచారం ఉందని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో 6.8 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతి ఇచ్చారన్న వార్తలు భయాందోళన కు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు యురేనియం తవ్వకాల ప్రతిపాదనలపై గతంలోనే కప్పట్రాళ్ల వాసుల వ్యతిరేకత వ్యక్తం చేశారని అయితే ప్రజలను మభ్యపెట్టి అధికారులు తాము చేస్తున్న సర్వే మైనింగ్ కొరకు మరియు అటవీ అభివృద్ధి కొరకు అని మభ్య పెట్టారని ఇక్కడ స్థానిక యువకులకు ఉద్యోగాలు వస్తాయని ప్రజలను మాయ మాటలు చెప్పారని వారు పేర్కొన్నారు తాజాగా మళ్లీ ఆ ప్రతిపాదనలు తెరపైకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అణు విద్యుత్ ఉత్పత్తిలో, అణ్వాయుధాల తయారీలో ఉపయోగించే యురేనియం అత్యంత ప్రమాదకరమని యురేనియం ఉన్న చోట మొక్క కూడా మొలవదని భయంకర పరిస్థితిలో ఆ ప్రాంతంలో ఉంటాయని పేర్కొన్నారు కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు సర్వే కోసం బోర్ల తవ్వకాలకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.. యురేనియం నిల్వలు అంచనా వేసేందుకు జరిపే తవ్వకాల వల్ల కప్పట్రాళ్ల అటవీ ప్రాంతం మొత్తం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు.. భూగర్భ జలాలు, తాగునీరు విషతుల్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అరుదైన జీవరాసులతో పాటు వృక్షసంపద ప్రమాదంలోపడి జీవవైవిధ్యం దెబ్బతింటుందనే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఈ కార్యక్రమంలో సిపిఎం మరియు ప్రజాసంఘాల నాయకులు అశోక్ భాషా సూరి మార్కండేయులు కప్పట్రాళ్ల గ్రామస్తులు కౌలుట్లయ్యఎర్ర, చిన్న కాలుట్లయ్య రంగడు గిడ్డయ్య తో పాటుగా చాలామంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు