దివ్యాంగులకు స్మార్ట్ టచ్ ఫోన్స్, ల్యాప్ టాప్ ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
దివ్యాంగులకు స్మార్ట్ టచ్ ఫోన్స్, ల్యాప్ టాప్ ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
కర్నూలు, అక్టోబర్ 21 (పీపుల్స్ మోటివేషన్):- దివ్యాంగులకు చేయూతను అందించేందుకు ముగ్గురు దివ్యాంగులకు టచ్ ఫోన్స్, ఒకరికి ల్యాప్ టాప్ ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పంపిణీ చేశారు.
సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో దివ్యాంగులకు స్మార్ట్ టచ్ ఫోన్స్, ల్యాప్ టాప్ ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ చదువుతున్న జి.మోహన్, ఎం.వేణు, ఎం.చందు ముగ్గురికి స్మార్ట్ టచ్ ఫోన్ లను, డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న అంధురాలు అయినా రేవతికి ల్యాప్ టాప్ ను విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందచేస్తున్నామని తెలిపారు. వీటిని వినియోగించుకుని ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులను రయిస్ ఫాతిమా పాల్గొన్నారు.