ప్రజల సమస్యలను రీ ఓపెన్ కాకుండా పరిష్కరించండి
ప్రజల సమస్యలను రీ ఓపెన్ కాకుండా పరిష్కరించండి
కర్నూలు, అక్టోబరు 21 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రజల సమస్యలను రీ ఓపెన్ కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 36 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయని, అర్జీలు రీ ఓపెన్ కాకుండా ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు..రీ ఓపెన్ అయిన దరఖాస్తులను సంబంధిత శాఖల పై అధికారులు పరిశీలించి వారి ఎండార్స్మెంట్ ను అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. సిఎం కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తులు 30 పెండింగ్ ఉన్నాయని, ఈ సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు..ఎప్పటికప్పుడు వచ్చిన పిటిషన్లను ఓపెన్ చేసి, నిర్దేశించిన గడువుకు ముందే సమస్యలను పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో కొన్ని వినతులు..
తుగ్గలి మండలం రాతన గ్రామం మాల వీధిలో నివసిస్తున్న ప్రజలు మాల నాగరాజు, పులికొండ రామంజి, నరేష్, రంగయ్య, తదితరులు మా మాల వీధిలోని ప్రజలు మా వీధిలో దాదాపుగా 15 ఇళ్లు ఉన్నాయి చివరి ఇంటి వరకు రోడ్డు వేయించాలని కోరుతూ కలెక్టర్ కి అర్జీ సమర్పించారు.
ఎస్సీ, ఎస్టి విజిలెన్స్ మరియు మానిటింగ్ కమిటీ సభ్యులు చిటికెల శామ్యూల్, కర్నూల్ నగరంలోని బిర్లా గేట్ నుండి దీన్నే దేవరపాడు గ్రామానికి వెళ్లి రోడ్డు సరిగా లేదని వర్షం వచ్చినప్పుడు ఆ రూట్ లో స్కూలుకు వెళ్లే ఎస్సీ మరియు ఎస్టీ హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ దారిలో వెళ్లే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని కావున ఈ రోడ్డును మరమ్మతులు చేయించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
కర్నూలు నగరంలోని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డి రాఘవేంద్ర, మరియు సభ్యులు కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో ప్రజల త్రాగునీటి సమస్య నివారణ కొరకు గ్రామంలో రెండు వాటర్ ట్యాంక్ ల నిర్మాణాలు చేపట్టారు, ఒక ట్యాంక్ పూర్తి చేశారు, రెండవ ట్యాంకు కూడా దాదాపుగా 80 శాతం పూర్తి చేశారు. పూర్తిచేసిన వాటర్ ట్యాంకు నీటిని నింపి ప్రజలకు అందించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.