గ్రామసభల్లో వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి
గ్రామసభల్లో వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి
వచ్చే నెల నుండి డివిజన్ వారీగా రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ల నిర్వహణ..
ఉపాధి పనులు కల్పించడంలో పురోగతి కనపర్చక పోతే కఠినమైన చర్యలు తప్పవు..
ఇళ్ల నిర్మాణాలలో మరింత పురోగతి సాధించండి..
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ బీమా నమోదు గురించి రైతులకు అవగాహన కల్పించండి..
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, అక్టోబర్ 25 (పీపుల్స్ మోటివేషన్):- కోర్టు కేసులు తప్ప గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి హౌసింగ్, ఉపాధి హామీ, పిజిఆర్ఎస్, క్రాప్ ఇన్సూరెన్స్ అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారం కోసమే గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోందని, ఈ గ్రామసభల్లో కోర్టు కేసులకు సంబంధించిన దరఖాస్తులు తప్ప మిగిలిన వాటిని వచ్చే వారం లోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు..ప్రతి పిటిషన్ ను క్షుణ్ణంగా చదివి మళ్లీ రిసర్వే కావాలంటే చేయించాలని కలెక్టర్ ఆదేశించారు..2,3 రోజుల్లో క్షేత్ర స్థాయికి వెళ్లి, రీసర్వే అవసరమైన చోట, SOP ప్రకారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు..
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను గడువు దాటకముందే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.. గడువుకు 48 గంటల ముందే అర్జీలు క్లోజ్ చేయాలని వీటిని ఓపెన్ కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.. ముఖ్యమంత్రి కార్యాలయ ఫిర్యాదులకు సంబంధించి ఇంకా 30 పెండింగ్ ఉన్నాయని,ఎక్కువ సంఖ్యలో పత్తికొండ ఆర్డిఓ కార్యాలయంలో పెండింగ్ ఉన్నాయని, వీటిని త్వరితగతిన, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆర్డీవో ను ఆదేశించారు.
వచ్చేనెల మొదటి వారం నుండి డివిజన్ల వారీగా, డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.. రెవెన్యూ అంశాలతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహిస్తామని ఇందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ప్రతి నెల ఈ సమావేశాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఉపాధి పనులు కల్పించడంలో ఎంపిడిఓ, ఏపిఓ లు చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఆస్పరి,పత్తికొండ, హోళగుంద, సి.బెలగల్, చిప్పగిరి, వెల్దుర్తి, కర్నూలు అర్బన్, కోసిగి, తుగ్గలి, పెద్దకడబూరు మండలాలు ఉపాధి పనుల కల్పనలో వెనుకబడి ఉన్నాయని, కృష్ణగిరి మండలం 34 శాతంతో చివరి స్థానంలో ఉందని, నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు కల్పించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు..వలసలు వెళ్లారని కారణాలు చెప్పొద్దని, వలసల నివారణ కోసమే ఉపాధి హామీ పథకం అమలు చేయడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు.. జనవరి నెల లోపు గోకులంలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు..
హౌసింగ్ కి సంబంధించి గత వీడియో కాన్ఫరెన్స్ నుండి ఇప్పటివరకు కొంత పురోగతి ఉందని, అయితే మరింత పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. జిల్లాలో 50 శాతం హౌసింగ్ నిర్మాణాలు ఆదోని నియోజకవర్గంలోనే ఉన్నందున ఆదోని సబ్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. ఇసుక, సిమెంట్, బిల్లుల చెల్లింపు సమస్యలు లేకుండా జాయింట్ కలెక్టర్, పీడీ హౌసింగ్, సబ్ కలెక్టర్,ఆర్డీవోలు, డిడి మైన్స్ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు..
మండలాల వారీగా ఆదోని అర్బన్, ఎమ్మిగనూరు అర్బన్, కర్నూలు రూరల్, పత్తికొండ, హలహర్వి, పెద్ద కడుబూరు, ఆలూరు, కర్నూలు అర్బన్, కౌతాళం, దేవనకొండ, గోనేగండ్ల, కోసిగి మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు.. ఇంజినీరింగ్ అసిస్టెంట్ లు, హౌసింగ్ ఇంజనీర్లతో సమీక్షలు నిర్వహించుకుని అన్ని మండలాల్లో ఇళ్ళ నిర్మాణాల్లో పురోగతి చూపించాలని కలెక్టర్ ఆదేశించారు..
ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రబీ లో నోటిఫై చేసిన పంటలకు ప్రీమియంను రైతులు చెలిస్తే ఇన్సూరెన్స్ కవరేజీ జరుగుతుందన్నారు. ఈ పథకానికి భూమి యజమానులు, కౌలు రైతులు ఇద్దరికీ అర్హత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.. రైతులకు అవగాహన కల్పించి ప్రీమియం చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. అదే విధంగా సిసిఆర్సీ కార్డులున్న కౌలు రైతులకు పంట రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు..
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో గత మూడు నెలలుగా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు... ఈ నెలలో కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండేలా పంపిణీ జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. చాలా మంది బదిలీలు అయ్యారని, కాబట్టి కొంత అవగాహన లోపం ఉండవచ్చని, పంపిణీ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవగాహన కల్పించాలన్నారు.. లబ్ధిదారులతో మ్యాపింగ్, పంపిణీ ప్రక్రియలు ప్రణాళికాబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.