-Advertisement-

సామాన్యుడిపై మెడికల్ మాఫియా పంజా..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

సామాన్యుడిపై మెడికల్ మాఫియా పంజా..

నేడు మెడికల్ మాఫియా తన కోరలు దాచుకుని సామాన్యుడి ప్రాణాలతో చెలగాట మాడుతుందా..

రోగుల వ్యాధులను, వారి అవసరాలను, బలహీనతలను అడ్డు పెట్టుకుని ప్రజల రక్తాన్ని తాగుతుండా.. 

అంటే అది నిజమేనని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

నేడు దేశంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా చూపినా వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే డాక్టర్లు, వారి రక్తాన్ని సైతం తాగేసే కార్పోరేట్ ఆసుపత్రులు, రోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని మందులను అధిక ధరలకు అమ్మేస్తున్న మందులు కంపెనీలు, దుకాణాదారులు కనిపిస్తారు..దీంతో అత్యవసర రంగమైన మెడికల్ కేర్ దోపిడీ వ్యవస్థగా మారిపోయింది.. దీనికి తోడు కార్పొరేట్ ఆసుపత్రులు, ఆయా ఆసుపత్రులతో పని చేసే బడా డాక్టర్లు ఫార్మా కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలతో అడ్డదారిలో రోగులను దోచుకుంటూ, అధిక సంపాదనే లక్ష్యంగా కాలం వెళ్ళదీస్తున్నారు. ఫార్మా కంపెనీలు, రిటైల్ చైన్ షాపులు, డాక్టర్లతో ఒప్పందాలు.. ఇలా అన్నీ ఒకదానికొకటి ముడిపెట్టుకుని ఉండడంతో అడ్డదారి మెడికల్ దోపిడీలో సామాన్యులతో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వారు సైతం భాగస్వాములవుతున్నారు. ఒకప్పుడు ఏదైనా జ్వరం వస్తే పాత కాలపు పద్ధతుల ఏ కషాయమో తాగించి ఆ జ్వరాన్ని రెండు రోజుల్లో తగ్గించేవారు. కానీ నేడా పరిస్థితి లేదు.. నేడు జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళితే చాలు వేలకు వేలు డాకర్లకు, ఆసుపత్రులకు చెల్లించుకోవాల్సిందే... ఆసుపత్రికి వెళ్ళగానే రోగి చెప్పే విషయం పట్టించుకోకుండా ఆయా డాక్టర్లు టెస్టులు, ఎక్స్రేలను అత్యవసరంగా చేయించేసి, రోగికి వేలల్లో ఖర్చును మిగులుస్తారు. తీరా ఆయా రిపోర్టులు వచ్చిన తరువాత అంతా. నార్మల్ గా ఉందని పెదవి విరచి జ్వరం తగ్గడానికి మందులు రాసిచ్చి చేతులు దులుపుకునే పరిస్థితులు నేడు దాపురించాయి. ముఖ్యంగా నగరాలలో ఉండే కార్పోరేట్ ఆసుపత్రులలో ఇలాంటి దోపిడీ మరీ దారుణంగా ఉంది. ఇక మందులు విషయానికి వస్తే, ఆయా డాక్టర్లు రాసిన మందులనే వాడాలన్న నిబంధన పెడతారు. దీనికి కారణం కూడా లేక పోలేదు. ఆయా డాక్టర్లు, మెడికల్ ప్రాక్టిషనర్లు అంతకు ముందే మందుల దుకాణాలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఫలానా దుకాణంలోనే మందులు కొనండి అంటూ సిఫార్సు చేస్తూ ఉంటారు. మరి కొంత మంది డాక్టర్లు ఇంకాస్త ముందుకెళ్ళి ఆ మందులను కూడా తామే విక్రయిస్తూ, తాము ఇచ్చే మందులు మరెక్కడా దొరకవని నమ్మబలికి రోగులను నిలువెల్లా గుల్ల చేస్తున్న సంఘటనలు కోకొల్లలు.. అలాగే, నేడు అత్యవసరం మందుల ధరలు కూడా అడ్డగోలుగా పెంచేస్తున్న రోజులు దాపురించాయి. ఆయా మందుల ధరలను ఎందుకు పెంచుతున్నారో. ఏ నిబంధనల మేరకు పెంచాలో అనే విషయాన్ని ఎవ్వరు గాక చెప్పరు.. ఏ అధికారీ కూడా కనీసం పట్టించుకోనూ చేయడు.. అవినీతిమయమై పోయిన వైద్యాధికారుల వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం.. అసలు ప్రతి ప్రాంతంలోనూ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వారి పైన కూడా అనేక మంది అధికారులుంటారు. కానీ వారెప్పుడూ మందుల దుకాణాలకు గానీ, ఆసుపత్రులకు గానీ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.. ఒక వేళ వచ్చినా ఏదో మొక్కుబడిగా ఆయా దుకాణాలను పరిశీలిస్తారు తప్ప అసలు ఏం జరుగుతోంది.. అనే విషయాన్ని గాలికొదిలేయడం వల్లనే మెడికల్ పేరుతో మాఫియా సామ్రాజ్యం రోజురోజుకు కోరలు పెంచుకుంటోంది. దీనికి చీకటి ఒప్పందాల క్రమంలో సమాజం దేవుళ్ళకు ప్రతిరూపంగా బావించే డాక్టర్లు సైతం అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. ఫార్మా కంపెనీల ప్రతినిధుల సూచనల మేరకే రోగులకు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఒక్కో వైద్యుడు లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో ఏ కంపెనీలతో ఒప్పందం కుదురుతుందో... ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ఖరీదైన మందులనే డాక్టర్లు ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్వహిస్తున్న తమ టాబ్ల్లెట్లలో ఆ మందులకు మాత్రమే డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. డిస్కౌంట్ కావాలంటే.. అంతకు ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని రోగులకు మాయమాటలు చెబుతూ, మరో రూపంలో కూడా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు' అన్న చందంగా విస్తరించి ఆయా మందుల కంపెనీల యజమానులు కోట్లకు పడగెత్తుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య పీడిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో సైతం సిందికేట్ మెడికల్ మాఫియా అమాయక ప్రజలే లక్ష్యంగా నిలువు దోపిడీకి పాల్పడుతోంది. నేటి సమాజంలో కల్తీ ఆహార పదార్థాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబంలోనూ మందుల వినియోగం దాదాపు నిత్యావసరంగా మారిపోతోంది. ఈ క్రమంలో మందుల విక్రయ సంస్థల ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. భారీ డిస్కౌంట్ల పేరుతో ఎర వేసి మందుల వ్యాపారాన్ని ఆయా సంస్థలు విస్తరింపజేసుకుంటున్నాయి. భేరసారాలకు ఏమాత్రం అవకాశం లేని మందుల విక్రయంలో ప్రభుత్వపరంగా ఎలాంటి నిఘా లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా మందులు కొనుగోలు చేయాల్సి రావడం.. చీకటి ఒప్పందాలకు, అక్రమ వ్యాపారాల విస్తరణకు పరోక్షంగా దోహదపడుతున్నాయి. అలాగే, నిబంధనల ప్రకారం వైద్యులప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు ఇవ్వాలి. ఈ నిబంధనలను చాలా మంది దుకాణదారులు పాటించడం లేదు. జ్వరం, జలుబు, తలనొప్పి, కదుపునొప్పి గ్యాస్టిక్ సమస్యలు, ఒంటినొప్పులు తదితర సమస్యలకు మెడికల్ షాపుల్లో అడగ్గానే మందులిచ్చేస్తున్నారు. చట్ట ప్రకారం కార్డియాలజీ, సైక్రియాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదు. కానీ తేడా పరిస్థితి లేదు. వీటికి తోడు డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలు సైతం జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీ ఔషధాలు లేకుంటే, వాటికి బదులు వేరే కంపెనీ మందులను దుకాణాదారులు అంటగట్టడం కూడా అలవాటై పోయింది. దీనికి తోడు మందుల దుకాణాల్లో డాక్టర్లకు ఇచ్చే శాంపిల్ మెడిసిన్, జనరిక్ మందులను కూడా ఎక్కువ ధరలకు యథేచ్చగా విక్రయిస్తూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఈ మెడికల్ మాఫియాను అరికట్టడానికి జనరిక్ మందులను ప్రవేశ పెట్టారు. కానీ ఈ జనరిక్ మందులు సైతం ఆకాశాన్నంటుతున్నాయి.. వంద రూపాయలు విలువ చేసే మందు మీద మూడు వంద రూపాయలు వెల ముద్రించి యాభై పర్సంటో, అరవై పర్సంటో డిస్కౌంటు ఇస్తున్నామని నమ్మ బలికి సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మరి కొన్ని చోట్ల పెద్ద దుకాణాల్లో సైతం జనరిక్ మందులు అంట గడుతూ, అధిక డిస్కౌంట్లు లేకుండా మందులు విక్రయించడం చేస్తుం డడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని అనై తిక కార్యక్రమాలు చేస్తున్నా ఆయా మందుల దుకాణాదారుల మీ ద కానీ, డాక్టర్ల మీద కానీ, కార్పొరేట్ ఆసుపత్రుల మీద కానీ చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. మా మూళ్ళకు కక్కుర్తి పడిన ఉద్యోగులు, అధికారుల వల్ల ఈ రం గం రోజురోజుకి సామాన్యుడికి ప్రాణాంతకంగా మారింది. ఏదో మొక్కుబడి తనిఖీలు తప్ప ఇలా అక్రమాలకు పాల్పడే వా రిపై చర్యలు తీసుకునేవారు నేడు కరవయ్యారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు యధేచ్చగా సాగుతున్న ఈ మాఫియాపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

Comments

-Advertisement-