మెడికల్ షాప్ మాయజాలం...?
General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
By
Peoples Motivation
మెడికల్ షాప్ మాయజాలం...?
మెడికల్ షాపు వైద్యం... ఎంతవరకు నయం..?
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ అమ్మకాలు...
నో రూల్స్...ఓన్లీ సేల్స్..!
మందుల షాపుల్లో కానరాని ఫార్మసిస్టులు..?
కొరవడిన ఔషధ నియంత్రణ అధికారుల పర్యవేక్షణ...?
మీకు కడుపునొప్పి వస్తోందా... తల తిరిగి పోతుందా... నిద్రపట్టడం లేదా.. మందులు తెచ్చుకునేదెలా అని ఆందోళన చెందుతున్నా రా..? అందుకు మీరేం హైరానా పడాల్సిన పనిలేదు మీకు ఏ మందులు కావాలంటే మందులు ఇట్టే మెడికల్ దుకాణంలో దొరుకుతాయి. డాక్టర్ రిసిప్ట్, లేకపోయినా సరే మీకు అవసరమైన మందులను ఇచ్చేస్తున్నారు. పైగా మీకున్న సమస్యను మెడికల్ దుకాణం సిబ్బందికి చెబితే చాలు ఏ మందులు వేసుకోవాలో రోజుకు ఎన్ని వేసుకోవాలో కూడా వారే చెప్పేస్తారు. ప్యాపిలి మండల వ్యాప్తంగా కొన్ని మెడికల్ దుకాణాలలో యథేచ్ఛగా సాగుతోంది. ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించడం కేసులు నమోదు చేయడం ఆపై చేతులు దులుపుకొని పోవడం పరిపాటయింది. ఈ నేపథ్యంలో మెడికల్ షాపు వైద్యం ఎంత వరకు నయమో ఓసారి గమనిద్దాం... నిజానికి ఏ మందులకైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మెడికల్ షాపుల నిర్వాహకులు మందులను ఇవ్వాలి. ఈ నిబంధనను ఏ ఒక్క మెడికల్ షాపు నిర్వాహకుడు పాటిస్తున్న దాఖలాలు లేవు. రోగి కానీ, అతని తాలూకా వ్యక్తిగాని వచ్చి ఫలానా మందులు కావాలంటే రిసిప్ట్ లేకున్నా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా కార్డియాలజీ, సైకియాట్రి, న్యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, అబార్షన్, డయాబెటిక్, బీపీ,మెడికల్ షాపుల మాయాజాలంలో డోస్ ఉంటాయి. రోగ తీవ్రత, వయసును బట్టి డాక్టర్లు దోసులను నిర్ణయిస్తారు. రిసిప్ట్ పై డాక్టర్ ఎన్ని మందులు రాశారో ఆ మేరకే ఇవ్వాలి. ఆ తర్వాత రోగి మరోసారి వచ్చి వాటిని కావాలని అడిగితే ఇవ్వకూడదు. కాలపరిమితి దాటిన మందులు, నకిలీ మందుల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయని మండలంలో ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే రోగి అడిగిన మందు లేకపోతే దానికి బదులుగా మరో కంపెనీకి చెందిన మందులను నిర్వాహకులు అంటగడుతున్నారు. కానీ ఎలాంటి అవగాహన లేనివారు చేస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.కాలం చెల్లిన మందులు వేసుకున్న వారికి వ్యాధి తగ్గకపోగా, కొత్త వ్యాధులు వస్తున్నాయి. దీంతో పట్టణంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మందుల దుకాణాలను డ్రగ్ ఇన్స్పెక్టర్ నిత్యం తనిఖీ చేస్తూ, ఆయా దుకాణాలకు లైసెన్సు ఉందా, సర్టిఫికెట్ ఉన్న ఫార్మసిస్టు దుకాణం నిర్వహిస్తున్నారా అనే విషయాలతోపాటు, కాలం చెల్లిన మందుల విక్రయాలు జరుపుతున్నారా..? అనే దానిపై ఇకనైనా అధికారులు దృష్టి సారించి తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అని ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పట్టణంలోకి రాకుండా డాబాలలోమెడికల్ షాఫ్ యజమానులతో కుమ్మక్కై అక్కడే వాళ్లకు రావాల్సిన వాటా తీసుకొని ఆటే వెళుతున్నారు అధికారులకు డబ్బు ఇస్తే చాలు ప్రజలు ఏమైనా వాళ్లకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.అలాగే మండల కేంద్రంలో విచ్చలవిడిగా ఆర్ఎంపీ డాక్టర్లు వారే మెడికల్ షాపులు నిర్వహిస్తూ ఏమీ తెలియని అమాయకుల నుండి కాసులు గుంజుకుంటూ మేడలు కట్టిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి సంసారాలు హ్యాపీగా కొనసాగుతూనే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments