తప్పిపోయిన పిల్లల ఆచూకీ లభ్యం.. సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా ఎస్పీ.
తప్పిపోయిన పిల్లల ఆచూకీ లభ్యం.. సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా ఎస్పీ.
జియో ట్యాగింగ్, హెల్ప్ డిస్క్ సేవలు భేష్.
పిల్లలు జియో ట్యాగింగ్ ధరించి ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే తల్లిదండ్రుల వివరాలు లభ్యం.
ఈరోజు మధ్యాహ్నం వరకు 45,000 మంది పిల్లలకు జియో ట్యాగ్లను అమర్చిన పోలీసులు.
బాధితుల నుండి ప్రశంసలు పొందుతున్న జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., ఆధ్వర్యంలోని పోలీసు యంత్రాంగం.
తిరుపతి, అక్టోబర్ 9 (పీపుల్స్ మోటివేషన్):-
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., వారి ఆదేశాల మేరకు పోలీస్ కంట్రోల్ రూమ్ ఇంచార్జ్ అదనపు ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో తిరుమలలో జియో ట్యాగింగ్ టీం లు మరియు హెల్ప్ డిస్క్ లను ఏర్పాటుచేసి, చిన్నపిల్లలు/ వయోవృద్ధులు తప్పిపోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
పిల్లల వివరాలు:-
1. ఈ రోజు ఉదయం సుమారు 9.30 గం ప్రాంతం లో మాడ వీధులలో తప్పిపోయిన పాప K. ఋషిక, తండ్రి: కుమార్, వయస్సు: 8 సం.లు, చిత్తూరు టౌన్ & జిల్లా అను పాపను చైల్డ్ ట్యాగ్ టీం పోలీసులు జియో ట్యాగింగ్ ద్వారా కేవలం 2 నిమిషాలలో బాలిక తల్లితండ్రులను గుర్తించారు.
2. ఈరోజు ఉదయం తిరుమలలో తప్పిపోయిన యాదవ్, తండ్రి వెంకటేష్, వయస్సు: 8 సం.లు, ధర్మపురి జిల్లా, తమిళనాడు స్టేట్ బాబును చైల్డ్ ట్యాగ్ టీం పోలీసులు జియో ట్యాగింగ్ ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే బాలుడి తల్లిదండ్రులను గుర్తించారు.
3. ఈరోజు ఉదయం తిరుమలలో తప్పిపోయిన బాలిక హనీ ప్రీతి, తండ్రి మహేష్, వయస్సు: 8 సం.లు, అంబర్ పేట, హైదరాబాద్ అనే పాపను చైల్డ్ ట్యాగ్ టీం పోలీసులు జియో టాగింగ్ ద్వారా బాలిక తల్లిదండ్రులను కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే గుర్తించారు.
స్థానిక పోలీస్ కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ పిల్లలను వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు జియో ట్యాగింగ్ టీం సుమారు 46,000 మంది పిల్లలకు జియో ట్యాగ్ లను అమర్చారు. చిన్నారుల తల్లిదండ్రులు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల పనితీరును మరియు జిల్లా ఎస్పీ ని ప్రశంసిస్తూ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పోలీస్ కంట్రోల్ రూమ్ అడిషనల్ ఎస్పీ సౌజన్య ని, చైల్డ్ ట్యాగ్ టీం సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు స్వప్న, కృష్ణ పావని మరియు చైల్డ్ ట్యాగ్ టీం పోలీసులను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు పరిపాలన, సౌజన్య కంట్రోల్ రూమ్ ఇంచార్జ్, చైల్డ్ ట్యాగ్ టీం సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు స్వప్న, కృష్ణ పావని మరియు చైల్డ్ ట్యాగ్ టీం పోలీసులు పాల్గొన్నారు.