రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

🌧 అల్పపీడనం.. అలర్ట్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి

Rain alert today Rain alert in my location Red alert weather today Red alert today Severe rainfall alert tomorrow Rain alert types IMD weather news
Peoples Motivation

🌧 అల్పపీడనం.. అలర్ట్ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి

- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

- భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉన్నది.

- తిరుపతి జిల్లా లో అల్పపీడనం ప్రభావం పోలీస్ శాఖ అప్రమత్తం.

- అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోరకు డైల్ 112/80999 99977 నెంబర్లుకు సమాచారం ఇచ్చి సహాయం పొందండి.

జిల్లా ఎస్పీ యల్.సుబ్బరాయుడు ఐపిఎస్

Rain alert today Rain alert in my location Red alert weather today Red alert today Severe rainfall alert tomorrow Rain alert types IMD weather news

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అక్టోబర్ 15 నుండి 18 వ తేదీ వరకు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ముందస్తు సమాచారం ఆధారంగా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

భారీ వర్షాలు, వరదల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అందరికంటే ఎక్కువ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యస్.పి ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., సూచించారు

జిల్లా ప్రజలకు పోలీసువారి సూచనలు..

1. రైల్వే అండర్ బ్రిడ్జిల క్రింద నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పడు ఆ మార్గంలో వెళ్ళకూడదు, వేరే మార్గాలలో వెళ్ళండి.

2. పాత భవనాలలో ఉండేవాళ్లు వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన.

3.కృంగే స్వభావం ఉన్న నేల, ప్రదేశంలో ఆవాసాలు ఉన్నవారు.. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలలో నివసించేవారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

                                                                                          4. తుపాన్లు వచ్చే సమయంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు అనుసరించడం వల్ల చాలా వరకు ప్రమాదాలు తప్పుతాయని అన్నారు.

ఈ పనులు అస్సలు చేయొద్దు..

                                                                                          1. వరద నీళ్లలోకి వెళ్లొద్దు. ముఖ్యంగా ప్రవహించే నీళ్లకు పిల్లలను దూరంగా ఉంచండి. 

2. వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయకండి. రెండు అడుగుల లోతున్న వరద నీటి ప్రవాహానికి పెద్ద కార్లు కూడా కొట్టుకుపోతాయి.

3. వరదల సమయంలో, విద్యుత్తు అంతరాయాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించండి. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు ఏర్పడినా, చుట్టూ నీళ్లు వచ్చేసినా లిఫ్ట్‌లలో చిక్కుకుని బయటకు రాలేని పరిస్థితి ఏర్పడొచ్చు.

4. మీరు తడిగా లేదా నీళ్లలో నిలబడి ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు.

5. మురుగు కాలువలు, కల్వర్టులు మొదలైన వాటికి దగ్గరగా వెళ్లవద్దు.

6. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను వెంటనే నమ్మేయవద్దు, వాటిని నిర్ధరించుకున్న తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకోండి.

7. అలాగే సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను వెంటనే ఫార్వర్డ్ చేయకండి. అవి నిజం కాని పక్షంలో వాటి వల్ల ఇతరులు అనవసరంగా ఆందోళనకు గురవుతారు.

ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా ప్రజలు పోలీసువారి సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోరకు డయల్ 112/80999 99977 నెంబర్లుకు సమాచారం ఇస్తే పోలిస్ వారు తక్షణ సహాయకచర్యలు అందిస్తారని జిల్లా ఎస్పీ యల్. సుబ్బరాయుడు ఐపిఎస్ ప్రజలకు సూచించారు.

Comments

-Advertisement-