BSNL 5G Smart Phone: సూపర్ న్యూస్.. త్వరలో మార్కెట్‌లోకి బీఎస్ఎన్ఎల్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఇవే
BSNL 5G Smart Phone: సూపర్ న్యూస్.. త్వరలో మార్కెట్‌లోకి బీఎస్ఎన్ఎల్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఇవే
ప్రైవేట్ ఆపరేట్లకు పోటీ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ రెడీ..
అద్భుతమైన ఫీచర్లతో, అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్..
అతి తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో ఉండేలా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. టెలికాం మార్కెట్‌లో మరో సంచలనానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తెరతీసింది. సెమీ అర్బన్ ఏరియాల్లో బలంగా ఉన్న BSNL అక్కడి ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది.
5జీ రేస్‌లో వెనకబడిపోయిన BSNL ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. త్వరలోనే 4జీ నెట్‌వర్క్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్న సంస్థ.. ఇప్పుడు 5జీ ఫోన్‌ను అందరికీ దగ్గర చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి ఫీచర్లు తెలియనప్పటికీ ఇలా ఉండొచ్చంటూ కొన్ని స్పెసిఫికేషన్లు వైరల్ అవుతున్నాయి.
BSNL 5G ఫోన్ ఫీచర్లు ఇలా..
BSNL 5G Smartphone ఫీచర్స్ 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ 5జీ చిప్‌సెట్, 4జీ/6జీ ర్యామ్ ఆప్షన్లు, 64 జీబీ/128 జీబీ స్టోరేజీ, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్లతో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 10 వేల నుంచి 15 వేల మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత స్మార్ట్‌ఫోన్ తయారీదారులైన మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్‌లలో ఒకదానితో జతకట్టి ఈ స్మార్ట్‌ఫోన్లు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.