-Advertisement-

డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు..

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS
Peoples Motivation

డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు..

• పోటీ పరీక్షలు, ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలు వస్తాయి.. 

• ఏ ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలు కూడా మధ్యవర్తుల ద్వారా రావు..

• నిరుద్యోగ యువత దళారుల మాటలు నమ్మి, డబ్బులు ఇచ్చి, మోస పోవద్దు..

• దళారాలు ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఆశ కలిగించి, నమ్మించి మోసాలు చేస్తారు జాగ్రత్త..

• నిరుద్యోగ యువత ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి..

-జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్

GENERAL NEWS TELUGU LATEST NEWS,APPSC GROUP 2,JOB NEWS HEALTH NEWS,TS DSC AP TET AP DSC SSC JOBS AP GOVT NEWS,TENTH JOBS,INTER JOBS,TGPSC GROUP 2 NEWS

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారని పలువురు బాధితులు కర్నూల్ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ దృష్టికి వచ్చారు. నిందితులపై చర్య లు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా ప్రజలు, నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జరిగే మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో మంగళవారం విజ్ఞప్తి చేశారు. 

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...

ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగాలు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తాయన్నారు. సాఫ్ట్ వేర్ జాబ్స్, బ్యాంకులలో ఉద్యోగాలు, సచివాలయాలలో ఉద్యోగాలు, హోంగార్డ్సు ఉద్యోగాలు, పుడ్ కార్పోరేషన్ లో ఉద్యోగాలంటూ పలు రకాల ఉద్యోగాల పేరుతో వివిధ రకాలుగా దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోతూనే ఉన్నారన్నారు. ఏ ఉద్యోగం అయినా మధ్యవర్తుల ద్వారా రాదన్నారు. ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అలాంటివి నమ్మిమోసపోవద్దన్నారు. అమాయకులనే లక్ష్యంగా ఎంచుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దళారులు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, డబ్బులు వసూలు చేసే వారి గురించిన సమాచారాన్ని స్ధానిక పోలీసు స్టేషన్లో ముందుస్తుగా ఫిర్యాదు చేసి తెలియజేయాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాల పేరుతో మోసపోతున్న ఫిర్యాదులు ఎక్కువగా అవుతున్నా కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలన్నారు.  

ఉద్యోగాల పేరుతో దళారుల మాటలు నమ్మిమోసపోవద్దని, డబ్బులు ఇచ్చి నష్టపోవద్దని పోటీ పరీక్షలు, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా యువతకు, విద్యార్ధులకు, జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.

Comments

-Advertisement-