Crime News: 48 గంటలలోపే అత్యాచార ఘటనలో నిందితుల అరెస్ట్, రూ,5200,నగదు స్వాధీనం
Crime News: 48 గంటలలోపే హత్యాచార ఘటనలో నిందితుల అరెస్ట్, రూ,5200,నగదు స్వాధీనం
రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి, డిజిపి ఆదేశాలతో...
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ చాలెంజ్ గా కేసు చేదింపు..
4 ప్రత్యేక పోలీసు బృందాలతో నలదిక్కుల గాలింపు..
హత్యాచార ఘటనలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తింపు..
అందులో ముగ్గురు మైనర్లు.. అయిదు మందిని అదుపులోకి తీసుకున్నాం... ఒకరు పరారీలో ఉన్నాడు..
స్పెషల్ కోర్టు ద్వారా నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తాం.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి ప్రణాళికలు చేపడుతాం..
మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరిక
ఈ కేసు చేదింపులో క్రియాశీలకంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీ,
పోలీస్ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి..
మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్ల బొమ్మానిపల్లి సమీపంలోని నిర్మాణం లో ఉన్న పేపర్ మిల్లు లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి అతని బార్య , కోడలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటనలో 48 గంటల లోపే నిందితులను అరెస్టు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి,డిజిపి ఆదేశాలతో..ఈ కేసును జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ చాలెంజి గా తీసుకొని స్వయంగా రంగంలోకి దిగారు. ఆధారాలు సేకరించడంతో పాటు సిసి ఫుటేజ్ ద్వారా నిందితుల ముఖ చిత్రాలను గుర్తించి 4, ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి నలదిక్కుల గాలింపు చర్యలు చేపట్టారు, సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల జాడ తెలుసుకొని 48 గంటలలోపే నిందితులను అరెస్టు చేసి ఈ సంచలన కేసుకు తెరదింపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
దోపిడీలు, హత్యాచారాలకు పాల్పడడం అలవాటుగా మారిన వ్యక్తులే వలస కూలీలపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నాగేంద్ర, ప్రవీణ్‌తోపాటు మరో ముగ్గురు మైనర్లను అరెస్టు చేసినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. రెండ్రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ వాచ్‌మెన్ ఇంట్లోకి ప్రవేశించి అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ చేసి, ఇంట్లో ఉన్న 5 వేల 200 రూపాయల నగదును దోచుకెళ్లినట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో శనివారం అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్‌మెన్, తదితర విధులను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ, కుమారుడిని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టి తాజాగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నేరస్థుల చరిత్ర..
ఇందులో ఎరికల కావిడి నాగేంద్ర త్యాగరాజు నగర్ శివాలయం రోడ్ గడ్డం ఏరియా చెందిన ఇతనిపై అనంతపురం , శ్రీ సత్య సాయి ,కర్నూల్ ,చిత్తూరు జిల్లాలలో 37 కేసులు పైగా ఉన్నాయి. సాకే ప్రవీణ్ లేపాక్షి పోలీస్ స్టేషన్లో హత్య కేసులో ముద్దాయి.. పరారీలో ఉన్న చాకలి శ్రీనివాసులు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ దోపిడి కేసులో ముద్దాయిగా ఉన్నారు.
ఈ కేసుపై హోం మంత్రి అనిత స్పందిస్తూ నిందితులకు వేగంగా శిక్ష పడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు చేపడతామన్నారు.
మీడియా సమావేశంలో హిందూపురం డిఎస్పి కెవి మహేష్, సిఐ లు ఆంజనేయులు, అబ్దుల్ కరీం జనార్ధన్, రాజగోపాల్ నాయుడు, ఎస్బి, ఎస్ఐ ప్రదీప్ కుమార్, అసలు సిబ్బంది పాల్గొన్నారు.
అరెస్టు కు క్రియాశీలకంగా పనిచేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించడంతోపాటు క్యాష్ రివార్డ్స్ ను అందజేశారు.