-Advertisement-

Cyclone Dana: దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది? తుపానుల కు ఎవరు పేర్లు పెడతారు?

Cyclones in india Cyclone Live Causes of cyclone Cyclones defination Cyclones pdf Types of cyclones Tropical cyclone Weather updates Rain Alerts news
Peoples Motivation

Cyclone Dana: దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది? తుపానుల కు ఎవరు పేర్లు పెడతారు?

-దానా పదాన్ని ప్రతిపాదించిన గల్ఫ్ దేశం ఖతార్

-అరబిక్ భాషలో దానా అంటే అందమైన ముత్యం, విలువైనది అని అర్థం

-గల్ఫ్ దేశాల్లో స్త్రీలకు ఈ పదంతో పేర్లు పెట్టడం సర్వసాధారణం

Cyclones in india Cyclone Live Causes of cyclone Cyclones defination Cyclones pdf Types of cyclones Tropical cyclone Weather updates Rain Alerts news

తుపానులను సులువుగా గుర్తించడం, ముప్పు నుంచి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ విధంగా పేర్లు పెడుతున్నారు. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘దానా’ తీవ్రంవైపు దూసుకోస్తోంది. గురువారం రాత్రికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. కాగా ఈ తీవ్ర తుపానుకు ‘దానా’ అనే పేరు ఎలా వచ్చింది? దీని అర్థం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. ‘దానా’ అనేది అరబిక్ పదం. ఈ పదాన్ని ఖతార్ ప్రతిపాదించింది. అరబిక్ భాషలో ఈ పదానికి ‘అత్యంత సంపూర్ణ పరిమాణం, అందమైన ముత్యం, విలువైనది అనే అర్థాలు వస్తాయి. దానా పదాన్ని స్త్రీలకు పేరుగా పెడుతుంటారు. అరబ్ దేశాలలో ఈ పేరు సర్వసాధారణం. ఇక పర్షియన్ భాషలో ‘దానా’ అంటే విరాళం, దానం వంటి అర్థాలు ఉన్నాయి.

తుపానులను సులువుగా గుర్తించడం, ముప్పు నుంచి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ విధంగా పేర్లు పెడుతున్నారు. తుపానులకు సంబంధించి దేశాల మధ్య మెరుగైన సమాచారం పంపిణీ కూడా ఒక కీలక లక్ష్యంగా ఉంది. ఈ విధంగా పేర్లు పెట్టడం ద్వారా తుపానులను ట్రాక్ చేయడం‌తో పాటు మీడియాకు సులువుగా సమాచారం అందించేందుకు వీలుంటుంది. 

ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపానులకు పేర్లు పెట్టేందుకు ఏప్రిల్ 2020లో 13 దేశాలు సమూహంగా ఏర్పడ్డాయి. ఈ జాబితాలో భారత్, బంగ్లాదేశ్, ఖతార్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తుపానుల నామకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తుంది. పేర్లు సాంస్కృతికంగా తటస్థంగా, పలకడానికి సులభంగా, ఏ వర్గాన్ని కించపరచకుండా ఉండాలని సూచనలు చేసింది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా దేశాలు పదాలను సూచిస్తుంటాయి. అంతర్జాతీయ నామకరణ విధానానికి అనుగుణంగా ‘దానా’ పదాన్ని ఖతార్ ప్రతిపాదించింది.

Comments

-Advertisement-