Dasara: దసరా పండుగ రోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? జమ్మి చెట్టు పూజకు ఎందుకు పూజిస్తారు?
Dasara: దసరా పండుగ రోజు ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? జమ్మి చెట్టు పూజకు ఎందుకు పూజిస్తారు?
దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. విజయదశమి రోజున శ్రీరాముడు లంకాపతి రావణుని సంహరించాడు. ఇది కాకుండా, విజయదశమి పండుగ దుర్గమాతతో కూడా ముడిపడి ఉంటుంది. ఈ రోజున దుర్గామాత మహిషాసురుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. దసరా పండుగను ప్రతి సంవత్సరం అశ్విన్ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. విజయదశమి రోజున దేశవ్యాప్తంగా రావణ దహనం జరుగుతుంది. అలాగే ఆయుధాలను పూజించే సంప్రదాయం కూడా ఉంది. దసరా రోజున రావణ దహనం, ఆయుధ పూజ, జమ్మి చెట్టును భక్తులు పూజిస్తారు. అలాగే ఈ పండగ రోజు.. పాలపిట్టను సైతం చూడాలంటారు..
జమ్మి చెట్టు పూజ?
పురాణాల ప్రకారం.. పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు. ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారని నమ్మిక. అంతే కాకుండా పాండవులు వనవాసానికి వెళ్లినప్పుడు ఆయుధాలను జమ్మి చెట్టుమీద పెట్టారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా రోజు జమ్మి చెట్టుకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. విజయదశమి పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టును పూజించి ఆ చెట్టు ఆకులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. జమ్మి ఆకులు విజయానికి సంకేతం. అందుకే ఇలా చేయాలి. ఇక బహిరంగంగా జరిగే రావణ దహనాన్ని తిలకిస్తే మంచిది. ఈ రోజు పాలపిట్టను చూడడం కూడా శుభ సంకేతంగా భావిస్తారు.
ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
పురాణాల ప్రకారం.. పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు. ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారని నమ్మిక. అంతే కాకుండా పాండవులు వనవాసానికి వెళ్లినప్పుడు ఆయుధాలను జమ్మి చెట్టుమీద పెట్టారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా రోజు జమ్మి చెట్టుకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.
ఇదే కాకుండా మరో కథనం కూడా ప్రకారంలో ఉంది. పురాణాల ప్రకారం ఈ పూజ దుర్గాదేవి మహిషాసుర రాక్షసుడితో యుద్ధం చేసేందుకు దేవతలందరూ తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారట. అలా ఎనిమిది చేతుల్లో అమ్మవారు అనేక ఆయుధాలను పట్టుకుని యుద్ధానికి దిగారట. తొమ్మిది రోజుల పాటు సాగిన యుద్ధ పోరాటంలో చివరికి రాక్షసుడిని సంహరించినదని పురానాలు చెబుతున్నాయి. అనంతరం ఆయుధాలను దేవతలు తిరిగి తీసుకుని రాక్షస సంహారం చేసి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా వాటిని పూజించారు. నాటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. వివిధ కుల వృత్తుల వాళ్లు వారి ఆయుధాలకు పూజలు నిర్వహిస్తారు.