HYDRAA: గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల... హైడ్రా ఆర్దినెన్స్‌కు ఆమోదం
HYDRAA: గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల... హైడ్రా ఆర్దినెన్స్‌కు ఆమోదం
హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా)కు విస్తృత అధికారాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
హైడ్రా ఆర్దినెన్స్‌కు గవర్నర్ ఆమోదం.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా)కు విస్తృత అధికారాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బీ) సెక్షన్‌ను చేర్చుతూ ఆర్డినెన్స్ జారీ అయింది. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులు కాపాడే బాధ్యత అప్పగించారు. అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది.