-Advertisement-

PM KISAN: పిఎం కిసాన్ నిధులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకున్నారా..

www.pmkisan.gov.in pm kisan status check aadhar card pm kisan payment status pm kisan status kyc pm kisan.gov.in registration pm kisan samman nidhi
Peoples Motivation

PM KISAN: పిఎం కిసాన్ నిధులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకున్నారా..!

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రంలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

www.pmkisan.gov.in pm kisan status check aadhar card pm kisan payment status pm kisan status kyc pm kisan.gov.in registration pm kisan samman nidhi

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రంలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకంలో భాగంగా 18వ విడతలో దేశ వ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా రైతుల ఖాతాల్లోకి రూ. 20,000 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో పాటు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖా మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

వెబ్‌కాస్ట్ ద్వారా దేశ వ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు), 1 లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్‌లతో సహా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పీఎం కిసాన్ నిధుల విడుదల రోజును.. పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్‌గా జరుపుకుంటూ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించి.. తద్వారా వారి జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

పీఎం కిసాన్ పథకం వివరాలు..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించారు. ఈ పతకం కింద భూమి కలిగిన ప్రతి రైతుకు మూడు సమాన వాయిదాల చొప్పున సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా ఇప్పటి వరకు 18 విడతలు నిధులు పంపిణీ చేయగా.. ఈ మొత్తం రూ. 3.45 లక్షల కోట్లు దాటిందని, దేశ వ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Comments

-Advertisement-