Muhurat Trading: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ముహురత్ ట్రేడింగ్ అంటే? ఎందుకు దీపావళి రోజున నిర్వహిస్తారు?
Muhurat Trading: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ముహురత్ ట్రేడింగ్ అంటే? ఎందుకు దీపావళి రోజున నిర్వహిస్తారు?
- దీపావళి పండుగ నవంబర్ 1న ముహురత్ ట్రేడింగ్..
- దీపావళి నాడు ఒక గంట సేపు ప్రత్యేకంగా ట్రేడింగ్ సెషన్..
- ఈ సమయంలో ట్రేడింగ్ చేసిన వారికి సంవత్సరం మొత్తం ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మకం..
- ఇంట్రాడే పొజీషన్లు 15 నిమిషాలకు ముందే ముగుస్తాయి..
Muhurat Trading: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు దీపావళి పండుగ నాడు (నవంబర్ 1న) ముహురత్ ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. కొత్త సంవత్ 2081 ప్రారంభానికి గుర్తుగా దీపావళి నాడు ఒక గంట సేపు ప్రత్యేకంగా ఈ ముహురత్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. దీపావళి రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ సాయంత్రం పూట ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ జరగనుంది.
2024 ముహురత్ ట్రేడింగ్ టైమ్స్:
మార్కెట్ ఓపెన్ - సాయంత్రం 6 గంటలకుమార్కెట్ క్లోజ్ - సాయంత్రం 7 గంటలకుట్రేడ్ మాడిఫికేషన్ ముగింపు సమయం - సాయంత్రం 7:10 గంటలకు
ముహురత్ ట్రేడింగ్ భారతీయుల విశ్వాసం:
దీపావళి పర్వదినాన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తే, వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే దీపావళి రోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని భారతీయుల విశ్వాసం. అందుకే దీపావళి రోజున ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్‌లో పాల్గొనేందుకు ఇష్టపడుతుంటారు. సంపదకు, ధనానికి దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తూ, కొత్త సంవత్సరంలో ముహురత్ ట్రేడింగ్ చేయడాన్ని హిందువులు సంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ముహురత్ను మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చేసిన పని మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ట్రేడింగ్ ప్రారంభమవగానే కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. ముహురత్ ట్రేడింగ్ మొదటగా 1957లో బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో ప్రారంభించారు. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ స్థాపించిన 1992లోనే, ఎన్‌ఎస్‌ఈలో ముహురత్ ట్రేడింగ్ కూడా ప్రారంభమైంది. ఈ గంట సమయంలో ట్రేడింగ్ చేసిన వారికి సంవత్సరం మొత్తం ఎక్కువ లాభాలు వస్తాయని ఒక నమ్మకం ఉంది. ముహురత్ ట్రేడింగ్ సమయంలో కొంత మొత్తంలో కొనుగోలు చేయటం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఇస్తుందని కొంత మంది విశ్వాసం..
ఇంట్రాడే ఆ సమయంలో ముగుస్తుంది:
ఇక ట్రేడింగ్ చేసేవాళ్లకు ఇంట్రాడే పొజీషన్లు 15 నిమిషాలకు ముందే ముగుస్తాయి. ప్రీ-ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 5:45 గంటల నుంచి 6:00 గంటల వరకు ఉంటుంది. ఈ ముహురత్ ట్రేడింగ్‌లో ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ ఫ్యూచర్స్ & ఆప్షన్స్, సెక్యూరిటీ లెండింగ్ & బారోయింగ్ లాంటి వివిధ విభాల్లో ట్రేడింగ్ జరుగుతుంది.