రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Police jobs: రానున్న రోజుల్లో 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం...

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

Police jobs: రానున్న రోజుల్లో 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం...

సాకేంతికంగా సౌకర్యాలు కల్పిస్తాం..

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం

విశ్రాంతి అనేది లేకుండా ప్రజల రక్షణ కోసం నిత్యం కష్టపడే వాళ్లు పోలీసులు

ఎపి పోలీస్ అంటే ఒక బ్రాండ్...

నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని అణిచివేసిన చరిత్ర ఉంది.

మళ్లీ పోలీసు శాఖను బలోపేతం చేస్తాం...

నాలుగు నెలల్లో రూ.100 కోట్లు ఇచ్చాం...

రూ.12 కోట్లతో తన ఇంటికి కంచె వేసుకున్న గత సిఎం....

ఫింగ‌ర్ ప్రింట్ ఐడెంటిఫికేష‌న్ కోసం రూ. 10 కోట్లు ఇవ్వలేదు..

సర్వేరాళ్లకు రూ. 700 కోట్లు ఖర్చు చేసిన గత సిఎం...

సీసీటీవీ కెమెరాల నిర్వహణకు కోసం రూ. 10 కోట్లు కూడా విడుదల చెయ్యలేదు

గత ప్రభుత్వం పోలీసు శాఖలోనే రూ. 763 కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టింది.

పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం

 

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news


అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సోమ‌వారం విజ‌య‌వాడ‌, ఇందిరాగాంధీ మున్సిప‌ల్ మైదానంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ పోలీస్ అమ‌ర‌వీరులకు ఘ‌న నివాళులు అర్పించారు. వారి కుటుంబాల‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు వదిలిన పోలీసుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ ఏటా అక్టోబ‌ర్ 21న పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నామన్నారు. 

1959, అక్టోబ‌ర్ 21వ తేదీన భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ల‌ఢ‌క్ లోయ‌లో భార‌త‌దేశ పోలీస్ బృందంపై చైనా ఆక‌స్మిక దాడి చేసిందన్నారు. త‌క్కువ సిబ్బంది ఉన్నా.. ప్రాణాలు పోతాయ‌ని తెలిసినా లెక్క‌చేయ‌కుండా తిరుగుబాటు చేశారన్నారు. ఆ సంఘ‌ట‌న‌లో ప‌దిమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారన్నారు. అలాంటి త్యాగ‌వీరులను స్మ‌రించుకోవాల‌నే ఉద్దేశంతో ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకుంటున్నామన్నారు. మ‌న రాష్ట్రంలో చూస్తే విధి నిర్వ‌హ‌ణ‌లో సీనియ‌ర్ అధికారులు సైతం ప్రాణ‌త్యాగం చేశారన్నారు. ఐపీఎస్ అధికారులు కేఎస్ వ్యాస్‌, ప‌ర‌దేశి నాయుడు, ఉమేష్ చంద్ర వంటి వారు న్యాయం కోసం, ధ‌ర్మం కోసం, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసి, ప్రాణ‌త్యాగం చేశారన్నారు. ఇలా అనేక మంది మ‌ర‌ణించారన్నారు. 

వారందరి ఆత్మ‌కు శాంతిక‌ల‌గాల‌ని భ‌గ‌వంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారి స్ఫూర్తి ప్ర‌తి పోలీస్‌లోనూ ఉందన్నారు. అమ‌ర‌వీరుల కుటుంబ స‌భ్యుల‌కు అండ‌గా నిలిచామన్నారు. వారి కుటుంబ స‌భ్యులు ఉన్న‌త స‌ర్వీసుల్లో ఉంటూ నేడు రాష్ట్ర ప్ర‌గ‌తికోసం ప‌నిచేసే ప‌రిస్థితికి వ‌చ్చారన్నారు.


పోలీస్ శాఖ అత్యంత కీలకం:

 అన్ని శాఖ‌ల కంటే పోలీస్ శాఖ అత్యంత కీల‌క‌మ‌ని.. స‌మాజ హితం కోసం చేసే కృషిలో పోలీసులు కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలు, ఆస్తుల‌ను కాపాడేందుకు రాత్రి, ప‌గ‌లూ అని లేకుండా క‌ష్ట‌ప‌డేది పోలీసులు అని అన్నారు. సంఘ విద్రోహ శ‌క్తులు అనేక రూపాల్లో స‌మాజానికి స‌వాళ్లు విసిరే సంద‌ర్భంలో వాటిని ఎదుర్కొంటూ ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టంలో పోలీసుల కృషి వెల‌క‌ట్ట‌లేనిదన్నారు. 24X7 గా పాటు ప‌నిచేస్తూ విధుల్లో ఉండే ప‌రిస్థితన్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టంలో విశేష కృషి చేసిన పోలీసుల‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోని బ్ర‌హ్మోత్స‌వాలు, ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్సవాలు స‌మ‌యంలో పోలీసులు బాగా ప‌నిచేశారన్నారు. శాంతి, భ‌ద్ర‌త‌ల‌ను కాపాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా ద‌ర్శ‌నం చేసుకునేలా కృషిచేశారన్నారు. 


 శాంతి, భ‌ద్ర‌తలకు తొలి ప్రాధాన్యం:

 ఏపీ పోలీసులు స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో గానీ, ఇప్పుడుగానీ దేశంలో ఓ ప్ర‌త్యేక బ్రాండ్ ఉన్న పోలీసులుగా గుర్తింపు సాధించారన్నారు. న‌క్స‌లిజాన్ని, క‌మ్యూన‌ల్ హింస‌ను, ఫ్యాక్ష‌నిజాన్ని, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణ‌చివేసిన ఘ‌న‌త ఏపీ పోలీసుల‌కే ద‌క్కిందన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జీరో క్రైమ్ ఉండాల, ఎవ‌రైనా నేరాలు చేయాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి రావాలని, దానికోసం స‌మ‌ర్థ‌వంత‌మైన, ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం చుట్టాలన్నారు. శాంతి, భ‌ద్ర‌తలు అనేవి ప్ర‌భుత్వానికి మొదటి ప్రాధాన్యమన్నారు. పోలీసు సంక్షేమం అనేది ఈ ప్ర‌భుత్వ బాధ్య‌త‌, పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట యంత్రాంగంగా త‌యారుచేయ‌డం మా క‌ర్త‌వ్యంగా భావిస్తున్నానన్నారు.


 పోలీసు వ్య‌వ‌స్థ‌లో సంస్కరణలు తెచ్చాం:

 2014 త‌ర్వాత పోలీసు వ్య‌వ‌స్థ‌లో అనేక మార్పులు తీసుకొచ్చామని, అవ‌స‌రం మేర‌కు వాహ‌నాలు, ప‌రిక‌రాలు, సాంకేతిక సౌక‌ర్యాల‌ను అందుబాటులో ఉంచామన్నారు. ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడ‌ల్ పోలీస్ గా ఉండాల‌నే ఉద్దేశంతో వివిధ చ‌ర్య‌లు తీసుకున్నామన్నారు. 2014-19లో రూ. 600 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు. కొత్త‌గా వాహ‌నాల‌కు రూ. 150 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు. పోలీస్ స్టేష‌న్లు, నివాస క్వార్ట‌ర్స్‌లో మౌలిక స‌దుపాయాలు కోసం, మంగ‌ళ‌గిరి పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌, టెక్ ట‌వ‌ర్ నిర్మాణం కోసం రూ. 170 కోట్లు ఖ‌ర్చుచేశామన్నారు. పోలీసుకార్యాల‌యాల మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం రూ. 60 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు. అధునాత‌న టెక్నాల‌జీ రావాల‌నే ఉద్దేశంతో రూ. 27 కోట్లు ఖ‌ర్చుచేసి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేశామన్నారు. దేశంలోనే అత్యాధునిక ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌ను స‌మైక్యాంధ్రాలో ఆనాటి ముఖ్య‌మంత్రిగా హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేశామన్నారు. క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్, డేటా సెంట‌ర్ కోసం రూ. 25 కోట్లు, ఆయుధాలు, మొబిలిటీ, ఇత‌ర నిర్మాణాల కోసం రాష్ట్ర వాటా కింద రూ. 80 కోట్లు, పోలీసు సంక్షేమం కోసం అయిదేళ్ల‌లో రూ. 55 కోట్లు, ఈ-ఆఫీస్ కోసం రూ. 20 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు. ఇలా 617 ప‌నుల‌కు రూ. 320 కోట్లు ఖ‌ర్చు చేసి ముందుకెళ్లుతున్నామన్నారు. పోలీసు శాఖ‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని, ఎక్క‌డిక‌క్క‌డ స‌వాళ్ల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. విశాఖ‌ప‌ట్నంలో దీనికోసం ప్ర‌త్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశామన్నారు. కేంద్రం రూ. 219 కోట్లు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డితే గ‌త ప్ర‌భుత్వం అది కూడా తీసుకోలేక‌పోయారన్నారు. కొత్త‌గా ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఏర్పాటుచేయ‌డం, రీజ‌న‌ల్ ల్యాబ్స్ ఏర్పాటుచేయ‌డానికి కేంద్రం రూ. 152 కోట్లు మంజూరుచేస్తే అదికూడా తీసుకోలేక‌పోయారన్నారు. పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు, ఆధునికీక‌రించేందుకు కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు ముందుకొస్తోందన్నారు. పోలీసుల‌పై పెట్టే పెట్టుబ‌డి.. రాష్ట్ర అభివృద్ధికి పెట్టే పెట్టుబ‌డిగా భావించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందుకు కృషిచేస్తున్నాయన్నారు. 


 సాంకేతికతను ఎప్పడికప్పుడు అందిస్తున్నాం..

 నేను ముఖ్య‌మంత్రిగా తొలిసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఎప్పుడూ పోలీసు వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పెట్టామన్నారు. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని పోలీసు శాఖ‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌కుందన్నారు. మ‌న‌వ‌ద్ద అధునాత‌న ఎక్విప్‌మెంట్ లేకుంటే నేర‌స్థుల‌తో పోరాడ‌లేమని, పోలీసు వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్యేక దృష్టిపెడ‌తామని, ఆధునిక ప‌రిక‌రాలు తెప్పిస్తామన్నారు.. రూ. 100 కోట్ల పైబ‌డిన బిల్లులుంటే వాట‌న్నింటినీ ప‌రిష్క‌రించామన్నారు. దిశ చ‌ట్టం లేదుగానీ.. దిశ పేరుతో వాహ‌నాల‌కు రూ. 16 కోట్ల బిల్లు పెండింగ్ పెడితే అవి కూడా చెల్లించామన్నారు. క‌మ్యూనికేష‌న్ ప‌రిక‌రాలు, నిర్మాణాలు, సైబ‌ర్ ల్యాబ్ కోసం గ‌త ప్ర‌భుత్వం రూ. 20 కోట్లు పెండింగ్ పెడితే వాటిని క్లియ‌ర్ చేశామన్నారు. కేంద్ర‌మిచ్చే నిధుల్లో రాష్ట్ర వాటా కింద 2021-22 వ‌ర‌కు ఇవ్వాల్సిన రూ. 61 కోట్లు పెండింగ్ పెడితే వాటిని క్లియ‌ర్ చేశామన్నారు. ఎవ‌రైనా త‌ప్పుచేస్తే వెంట‌నే వారిని ప‌ట్టుకునే వ్య‌వ‌స్థ మ‌న‌ద‌గ్గ‌ర ఉంటే ఎవ‌రైనా భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉంటుందన్నారు. 

 గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో క‌క్ష‌సాధింపు, రాజ‌కీయ వేధింపుల కోసం పోలీసుల‌ను త‌యారుచేసే ప‌రిస్థితికి వ‌చ్చారన్నారు. అలాంటి ప‌నుల‌కు ప్ర‌తిష్టాత్మ‌క ఐపీఎస్ వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించారన్నారు. పోలీసులంటే రాగ‌ద్వేషాల‌కు అతీతంగా ప‌నిచేసే వ్య‌వ‌స్జ‌, నేర‌స్థులు ఏ రూపంలో వ‌చ్చినా ప‌సిగ‌ట్టి స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే వ్య‌వ‌స్థ‌ అని అన్నారు. ఆనాటి ముఖ్య‌మంత్రి ర‌క్ష‌ణ కోసం రూ. 12 కోట్లతో కంచె వేసుకొనన్నారన్నారు. ఫింగ‌ర్ ప్రింటింగ్ ఐడెంటిఫికేష‌న్ వంటి వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ కోసం అయిదేళ్ల‌లో రూ. 10 కోట్లు ఇవ్వ‌లేక‌పోయారన్నారు. మ‌రోవైపు స‌ర్వే రాళ్ల‌పైన రూ. 700 కోట్లు త‌గ‌లేసిన వ్య‌క్తి సీసీటీవీ కెమెరాల కోసం రూ. 700 కోట్లు ఇవ్వ‌లేక‌పోయారన్నారు. ఈ మొత్తం ఇచ్చుంటే ఈరోజు అఘాయిత్యాలు జ‌రిగే ప‌రిస్థితి ఉండేది కాదన్నారు. విశాఖ‌లో రూ. 500 కోట్ల‌తో ప్యాలెస్ క‌ట్టుకున్న వ్య‌క్తి పోలీసుల‌కు స‌రెండ‌ర్ లీవ్‌లు ఇవ్వ‌క‌పోవ‌డం చాలా బాధాక‌రన్నారు. నాకు కూడా పెను స‌వాళ్లు ఉన్నాయని, రూ. 10,50,000 కోట్లు గ‌త ప్ర‌భుత్వం వార‌స‌త్వంగా తీసుకున్న అప్పుల‌న్నీంటికీ వ‌డ్డీ చెల్లించాలన్నారు. అప్పులు చెల్లించాల్సి ఉంది, ఇదే స‌మ‌యంలో మీ సంక్షేమానికి ప‌నిచేయాల్సిన అవ‌స‌ర‌ముందన్నారు.


రాజ‌కీయాల ముసుగులో నేరాల‌కు పాల్ప‌డే వారిపై కఠిన చర్యలు:

నేడు పోలీసు శాఖ‌లో అనేక స‌వాళ్లు ఉన్నాయి, సైబ‌ర్ నేరాలూ పెరుగుతున్నాయన్నారు. నేర‌గాళ్ల కంటే మెరుగ్గా మ‌నం టెక్నాల‌జీని అప్‌డేట్ చేసుకుంటే శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌గ‌లమన్నారు. మ‌న‌ది పైచేయి అయిన‌ప్పుడే నేర‌గాళ్ల‌ను క‌ట్ట‌డిచేయ‌గ‌లుగుతామన్నారు. కొంద‌రు రాజ‌కీయ ముసుగులో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. పోలీసు వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారన్నారు. ఆ ముసుగు తీసి శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడే విష‌యంలో పోలీసుల‌కు అండ‌గా ఉండే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిద‌ని తెలియ‌జేస్తున్నామన్నారు. 1995 నుంచి టెక్నాల‌జీని ప్ర‌మోట్ చేస్తున్నామన్నారు. బాడీ వార్న్ కెమెరాలు తీసుకొచ్చామన్నారు. సెంట్ర‌ల్ కంట్రోల్ రూమ్ నుంచి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చామన్నారు. డ్రోన్స్‌, సీసీటీవీ, సెల్‌ఫోన్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోగ‌లిగితే, రియ‌ల్‌టైమ్ ప‌రిస్థితిని మానిట‌రింగ్ చేయ‌గ‌లిగితే నేర‌స్తులు ద‌గ్గ‌ర‌కొచ్చేందుకు భ‌య‌ప‌డ‌తారన్నారు. మూడో నేత్రం మ‌న పోలీసు వ్య‌వ‌స్థ అన్నారు. ఇప్పుడు మూడో నేత్రానికి స‌హ‌క‌రించే వ్య‌వ‌స్థ టెక్నాల‌జీ అని తెలియ‌జేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్ర‌తి సెన్సిటివ్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరా ఉంటుందన్నారు. నేరుగా కంట్రోల్ రూమ్‌కు అనుసంధాన‌మ‌వుతుందన్నారు. అన‌లిటిక్స్ , డేటాను మానిట‌ర్ చేయ‌డం జ‌రుగుతుందన్నారు. ఎవ‌రైనా రౌడీయిజం చేయాల‌ని చూస్తే అదే వారికి చివ‌రిరోజు కావాల‌నేది నా ఆకాంక్ష‌, ఆ విధంగా మా పోలీసు వ్య‌వ‌స్థ‌ను త‌యారుచేస్తామన్నారు. నేర‌గాళ్ల‌కు శిక్ష‌ప‌డేలా చేస్తా

Comments

-Advertisement-