-Advertisement-

Navaratrulu: నవరాత్రి రోజుల్లో ఒక్కో రోజు ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారు ఇలా...

9 days of Navratri Devi names Navratri Story Navratri information in Telugu When is Navratri in 2024 How many Navratri in a year 9 Goddess of Navratri
Peoples Motivation

Navaratrulu: నవరాత్రి రోజుల్లో ఒక్కో రోజు ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారు ఇలా...

Navaratrulu: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

9 days of Navratri Devi names Navratri Story Navratri information in Telugu When is Navratri in 2024 How many Navratri in a year 9 Goddess of Navratri

నవరాత్రి అలంకరణలో ఒక్కో రోజు ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని అలంకరిస్తారు.

మొదటి రోజు - శ్రీబాలా త్రిపుర సుందరీదేవి

దసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాబా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దనరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.


2వ రోజు - శ్రీగాయత్రిదేవి

రెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తు లకు దర్శనమిచ్చాడు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేడ మాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలస సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం పొందుతారు.


3వ రోజు - శ్రీ అన్నపూర్ణాదేవి

దసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శిం చుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని పొందగలుగుతారు.


4వ రోజు- శ్రీలలితా త్రిపుర సుందరీదేవి

దసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదే విగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.


5వ రోజు- శ్రీ మహాచండీదేవి

ఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మ వారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరి కలు అన్ని సత్వరమే తీరుతాయి.


6వ రోజు - శ్రీమహాలక్ష్మీదేవి

ఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తు లకు దర్శనమిస్తారు. లోక స్థితికారిణిగా, అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.


7వ రోజు - శ్రీసరస్వతిదేవి

ఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు చర్చన మిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం పొందుతారు.


8వ రోజు - శ్రీదుర్గాదేవి

8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శ సమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు రాక్షసుడిని సంహరించి దుర్గతులను పొగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గ దేవిని అర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.


9వ రోజు- శ్రీమహిషాసుర మర్దనిదేవి

దసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్దనిదేవిగా భక్తులకు దర్శన మిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహ వాహినియై, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, 'A మానవుల కష్టాలను తొలగించింది. మహిషా సురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవా దీని దర్శించడం వల్ల ఆదిస్వర్గాలు నశింది. సాత్విక భావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు వంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.


10వ రోజు - శ్రీరాజరాజేశ్వరిదేవి

దసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకు గడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరి. దేవిని దర్శించి అర్పించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.

Comments

-Advertisement-