రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Ration card: రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే వంటనూనెలు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

Ration card: రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే వంటనూనెలు

శుక్రవారం నుంచి నెలాఖరు వరకూ రేషన్ కార్డుదారులకు తక్కువ ధరలకు వంట నూనెలు 

పామోలిన్ లీటర్ రూ110లు, 

సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 

చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడి

వ్యాపారస్తులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

ఆంధ్రప్రదేశ్ లో అన్ని రేషన్ దుకాణాల్లో శుక్రవారం (అక్టోబర్ 11) నుంచి నెల ఆఖరు వరకు పామోలిన్‌ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఒక్కో రేషన్‌ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ధరల నియంత్రణపై వారితో చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్‌ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి వివరించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా, రాష్ట్రమంతా ఒకే ధరపై విక్రయించాలని మంత్రి నాదేండ్ల వారికి సూచించారు.

Comments

-Advertisement-