-Advertisement-

APPSC: ఎంతో మంది నిరుద్యోగుల కల.. గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష మళ్లీ వాయిదా?

APPSC Group-2 Mains Exam Postponed, appsc group 2 prelims qualifying marks appsc group 2 notification appsc group 2 syllabus group 2 results 2024 date
Peoples Motivation

APPSC: ఎంతో మంది నిరుద్యోగుల కల.. గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష మళ్లీ వాయిదా?

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష వాయిదా...

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు పరీక్ష రాసే అవకాశం...

పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థుల విజ్ఞప్తి...

APPSC Group-2 Mains Exam Postponed, appsc group 2 prelims qualifying marks appsc group 2 notification appsc group 2 syllabus group 2 results 2024 date

APPSC: వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరుతున్నారు. సిలబస్ మార్పులు, పూర్తి స్థాయిలో సన్నద్ధత కోసం మరికొంత సమయం పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన, ఆందోళన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఏపీపీఎస్సీ కి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల వినతి మేరకు గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధులు సైతం ఏపీపీఎస్సీ ఛైర్ పర్సన్ అనురాధను కలసి వేర్వేరుగా విజ్ఞాపన పత్రాలిచ్చారు. మరో 30 రోజులు గడువు పెంచి ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించాలని కోరారు.

వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది జనవరి 5న జరగాల్సిన గ్రూప్‌-2 మెయిన్స్ ఫిబ్రవరి 23కు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది.

ఎంతో మంది నిరుద్యోగుల కల:

ప్రభుత్వ కొలువు సాధించాలన్న ఎంతో మంది నిరుద్యోగుల జీవిత కలను గత ప్రభుత్వం నీరుగార్చింది. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన జగన్ కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నియామకాలను పక్కన పెట్టారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలకు దిగడంతో గతేడాది డిసెంబర్ 7న హడావుడిగా 897 పోస్టుల భర్తీకి మాత్రమే గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. సిలబస్‌లో మార్పులు చేసి అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం ఇవ్వకుండా ఆగమేఘాలపై నియామక ప్రక్రియ చేపట్టింది. గ్రూప్‌-2కు 4లక్షల 83వేల 535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4 లక్షల 4 వేల 37మంది హాజరయ్యారు. వారిలో 92వేల 250మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

Comments

-Advertisement-