-Advertisement-

APSRTC: ఈ ఆరు రకాల కార్డులుంటే వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ.. మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్టీసీ

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New
Peoples Motivation

APSRTC: ఈ ఆరు రకాల కార్డులుంటే వృద్ధులకు ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ.. మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్టీసీ

• వృద్దులకు ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ..

• అన్ని బస్సుల్లో వృద్దులకు టికెట్ల రాయితీపై సిబ్బందికి మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలు..

• ఆరు గుర్తింపు కార్డుల్లో ఏదో ఓకటి చూపిస్తే చాలు.. 

• అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆదేశాలు జారీ చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ..

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్దులకు టికెట్ ధరలో 25 శాతం రాయితీ టికెట్లను ఎప్పట్నుంచో ఆర్టీసీ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టికెట్లు జారీ చేసే సమయంలో వయసు నిర్దారణ కోసం గుర్తింపు కార్డులు చూపించే విషయమై సిబ్బంది, వృద్దులకు మధ్య బస్సుల్లో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణించే వృద్దులకు ఇస్తున్న రాయితీ టికెట్ల విషయమై పాటించాల్సిన నియమాలను సిబ్బందికి మరోసారి APSRTC స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పల రాజు ఈ ఆదేశాలు జారీ చేశారు. 

సిబ్బందికి తాజాగా మరోసారి ఆదేశాలు..

వృద్దులు వయసు నిర్దారణ కోసం 6 రకాలైన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించవచ్చని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ సిబ్బంది కేవలం ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే టికెట్ పై రాయితీ జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డులను అంగీకరించడం లేదు. ఒరిజినల్ కార్డులు లేనప్పుడు డిజిటల్ కార్డులు చూపించవచ్చని తెలిపినా సిబ్బంది అవగాహన లేమితో టికెట్ల జారీకి నిరాకరిస్తున్నారు. దీనిపై పలు ప్రాంతాల నుంచి వృద్దులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో రాయితీ టికెట్ల జారీ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేస్తూ సిబ్బందికి తాజాగా మరోసారి ఆదేశాలిచ్చింది. 

ఆరు గుర్తింపు కార్డుల్లో ఏదో ఓకటి చూపిస్తే చాలు.. 

ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకపోతే ఫోన్లో డిజిటల్ గుర్తింపు కార్డులు చూపినా రాయితీ టికెట్ జారీ చేయాలని సిబ్బందికి ఆర్టీసీ ఆదేశించింది. వృద్దులు తమ ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ పోర్టు, లేదా రేషన్ కార్డుల్లో ఏదో ఓకటి చూపించి రాయితీ పొందవచ్చని స్పష్టం చేసింది. ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా అందరికీ, అన్ని బస్సుల్లో వృద్దులకు రాయితీ టికెట్లు ఇవ్వాలని సిబ్బందికి ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి స్పష్టమైన ఆదేశాలు చేసింది.

Comments

-Advertisement-