ప్రజలకు ఉపయోగపడేలా ప్రెస్ పనిచేయాలి..
ప్రజలకు ఉపయోగపడేలా ప్రెస్ పనిచేయాలి..
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.. ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి
ఈ సందర్భంగా.. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడంలో భాగంగా పత్రికలు నైతికపరమైన, న్యాయమైన, బాధ్యతాయుతమైన కార్యకలాపాలను నిర్వహించాలి. వ్యక్తుల ప్రయోజనాల కోసం కాక వ్యవస్థలను పటిష్టపరిచి ప్రజలకు ఉపయోగ పడేలా ప్రెస్ పనిచేయాలి.
వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో పాత్రికేయ రంగం సమగ్రతతో వ్యవహరించి, నిజాలను చెప్పడం, తప్పుడు ఎదుర్కోవడాన్ని స్పూర్తిమంతంగా సమాజంలోకి తీసుకెళ్లాలి. పత్రికా స్వేచ్ఛ పదు గురికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప దాన్ని అవకాశంగా తీసుకుని నచ్చిన రాతలతో తనదైన భాష్యం చెప్పడం గర్హనీయం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణం ప్రభుత్వాలకు అవసరమైన పత్రికలు, విలేకరులు అందించాలి తప్ప తమదైన భావాలను ప్రజలపై రుద్దకూడదు. సోషల్ మీడియా వెల్లువలో నిజం, అబద్ధం మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించలేని పరిస్థితి ఉంది. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సమగ్రత, వాస్తవాలను ఖచ్చితంగా అందించడం, స్థిరమైన దృక్పథాలను అందించడం, సంబంధం లేని వ్యక్తుల ప్రభావం లేకుండా సత్యాన్ని వెలికితీసే గురుతర బాధ్యత గురించి అందరూ ఆలోచించాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
గత ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహించడం గమనించాం.. అప్పుడు ఆరంభ శూరత్వంతో ప్రారంభించి ఆపేసిన పనులను మేము ముందుకు తీసుకువెళుతున్నామని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నామని తెలిపారు.