మహిళలకు ఆమడదూరంలో అధ్యక్ష పీఠం
General News telugu
Trending news telugu
Intresting news
Telugu daily news
Current Affairs Quiz
Current Affairs pdf
Breaking news telugu
Political New
By
Peoples Motivation
మహిళలకు ఆమడదూరంలో అధ్యక్ష పీఠం
రెండున్నర శతాబ్దాల్లో అందని ద్రాక్ష హిల్లరీ క్లింటన్, కమలా హారిస్లకు దక్కని ఊరట
అమెరికా అధ్యక్ష పదవికి మహిళా అధినేతను ఎన్నుకోవాలన్న ప్రయత్నం ఫలించడం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలు పోటీ చేసేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొందరు అభ్యర్థిత్వానికి పోటీ పడి ఓడిపోగా.. మరికొందరు మాత్రం అధ్యక్ష బరిలో నిలిచి పరాజయం పొందారు. 248 ఏళ్ల ఆ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటి వరకూ 'వుమెన్ ప్రెసిడెంట్' పాలన లేదు. ఈ అగ్ర పీఠం కోసం కొందరు మహిళలు పోటీ పడినప్పటికీ.. విజయ తీరాలకు చేరుకోలేక పోయారు. తాజాగా భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ కూడా డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధ్యక్షపీఠానికి దూరంగానే ఉండిపోయారు. సర్వేలన్నీ కమలవైపు మొగ్గుచూపినా ట్రంప్ విజయం సాధించారు. సింగపూర్, ఫిన్లాండ్ సహా అనేక దేశాల్లో మహిళలే సారథులు ఉండి దేశాన్ని నడిపిస్తున్నారు. కానీ, అమెరికాలో మాత్రం మహిళలు ఓటు హక్కు పొందేందుకే అనేక ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది. 1920లో అమెరికా మహిళలకు ఓటు హక్కు లభించినప్పటికీ.. అది కొందరికే పరిమితమైంది. ఏళ్ల పోరాటం అనంతరం చివరకు 1960ల్లో అన్ని వర్గాల మహిళలకు అమెరికాలో ఓటు హక్కు దక్కింది. ఈ క్రమంలో రాజకీయ చైతన్యం పొందిన వారు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అధ్యక్ష పీఠానికి మాత్రం దగ్గర కాలేకపోతున్నారు. గతంలో మార్గరేట్ చేస్ స్మిత్, షెల్లీ చిసమ్ అధ్యక్ష అభ్యర్థిత్వాని కి పోటీ పడ్డారు. ఇక హిల్లరీ క్లింటన్, కమలా హారిస్ ఎన్నికల వరకూ చేరుకొని ఓటమి చవిచూశారు. 2016లో హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పీఠానికి దరిదాపుల్లోకి వచ్చినట్లే వచ్చి ఓడిపోయారు. అప్పటి ఎన్నికల్లో ట్రంప్ కంటే 30 లక్షల ఎక్కువ ఓట్లు సంపాదించారు. కానీ కీలకమైన ఎలక్టోరల్ కాలేజీలో మాత్రం ఆయన కంటే వెనుకబడిపోయారు. తాజాగా కమలా హారిస్ కు ట్రంప్ కు గట్టి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ పాపులర్, ఎలక్టోరల్ ఓట్లలో వెనుకబడిపోయిన కమల.. అధ్యక్ష పీఠాన్ని చేరుకోలేక పోయారు. ఈ క్రమంలో గతంలో అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నించిన మహిళా నేతలను పరిశీలిస్తే.. 1964లో తొలిసారి మార్గరేట్ చేస్ స్మిత్ అనే మహిళ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడ్డారు. కానీ అభ్యర్థిత్వమే దక్కలేదు. ఆమె అధ్యక్ష పీఠానికి తొలి పోటీదారుగా నిలిచారు. 1968లో... షెల్లీ చిసమ్ తొలి నల్లజాతి మహిళా సెనెటర్గా ఎన్నికయ్యారు. 1972లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. కానీ ఆమెకూ చుక్కెదురే అయింది. 1980లనాటికి అమెరికాలో ఫెమినిజం ఊపందుకుంది. ఫలితంగా 1984లో తొలిసారిగా... డెమోక్రాటిక్ పార్టీ తరఫున గెరాల్డిన్ ఫెరారో... అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. కానీ ఓడిపోయారు. కానీ మహిళల తరఫున అడుగైతే ముందుకు పడింది. 2008లో.. హిల్లరీ క్లింటన్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కానీ పార్టీ అభ్యర్థిత్వం సంపాదించుకోలేకపోయారు. 2016లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన కమలా హారిస్.. చివరకు పరాజయం పాలవడంతో అధ్యక్ష పీఠాన్ని చేరుకోలేకపోయారు. మొత్తంగా ఇన్నేళ్లచరిత్రలో ఒక్కసారి కూడ మహిళలు అధ్యక్షులుగా ఎన్నిక కాలేదు. శ్రీలంక, భారత్, పాక్, బంగ్లాలో మహిళలు ఉన్నత పదవుల్లో రాణించారు.
Comments