-Advertisement-

మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటు..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news
Peoples Motivation

మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటు..

స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి పెట్టండి

ఇంటర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టండి

రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటుచేసే వారికి త్వరితగతిన అనుమతులు

-ఇంటర్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC SSC jobs ap govt news

ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మండలానికో ఇంటర్ కళాశాల ఏర్పాటునకు ప్రణాళికలు రూపొందించాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో ఇంటర్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి సారించాలన్నారు. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి ఐఐటీ, మెడిసిన్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలను దినపత్రికల్లో ప్రచురించేలా కసరత్తు చేయాలన్నారు. రిమోట్ ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే వారికి త్వరితగతిన అనుమతులు అందించాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం వల్ల 15వేల వరకు అడ్మిషన్లు పెరిగాయనే విషయాన్ని అధికారులు మంత్రికి వివరించారు. వచ్చే ఏడాది 2 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. జూనియర్ కాలేజీల్లో పనివేళలు పెంచడంతో పాటు విద్యార్థుల హాజరుపై సమీక్ష, ప్రోగెస్ కార్డులను అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఉత్తమ అధ్యాపకులతో విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులకు శిక్షణ ఇప్పించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టడంతో పాటు ప్రశ్నాపత్రంలోనూ మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-