-Advertisement-

PMJAY: 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కోసం.. ఇలా నమోదు చేసుకోండి?

www.pmjay.gov.in login pmjay.gov.in registration PMJAY Card Download PMJAY gov in Card Download PMJAY apply PMJAY beneficiary pmjay.gov.in list PMJAY
Peoples Motivation

PMJAY: 70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కోసం.. ఇలా నమోదు చేసుకోండి?

PMJAY: దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అంచనా. ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. 'ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన' (Ayushman Bharat) కింద తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ 29న ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా ఈ పథకానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, గర్భిణులు, చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన యూ-విన్ పోర్టల్ (U-WIN)ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.

www.pmjay.gov.in login pmjay.gov.in registration PMJAY Card Download PMJAY gov in Card Download PMJAY apply PMJAY beneficiary pmjay.gov.in list BIS PMJAY

పేద, ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. దీనికింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్ఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని (AB-PMJAY) గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు.

70 ఏళ్లపైబడిన వారికి ఉచిత చికిత్స ఎలా లభిస్తుంది?

ఈ పథకం కోసం.. వృద్ధులకు ప్రత్యేక ఆయుష్మాన్ కార్డు అందించనున్నారు. ఇది కుటుంబ ఆయుష్మాన్ ప్లాన్ కు భిన్నంగా ఉంటుంది. అక్టోబర్ 29 నుంచి ఈ ప్రత్యేక కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పలువురు వృద్ధులకు కార్డులు అందజేశారు. ఈ సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ కార్డు బీఐఎస్ (BIS) పోర్టల్/ఆయుష్మాన్ యాప్ ద్వారా తయారు చేస్తున్నారు. దీని కోసం వృద్ధులు తమ ఆధార్ కార్డ్, కేవైసీ (KYC)ని కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వృద్ధులు ప్రైవేట్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇన్సూరెన్స్ లో ఎంచుకునే అవకాశం ఉంటుంది.

Ayushman Bharat Card కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చు. PMJAY పోర్టల్లో 'యామ్ ఐ ఎలిజిబుల్' ట్యాగ్ పై క్లిక్ చేయాలి. దీంతో beneficiary.nha.gov.in అనే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి.. ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ద్రువీకరణ పత్రాల్లో ఆధార్ ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.

Comments

-Advertisement-