రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏపీ ఏకలవ్య మోడల్‌ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

Ekalavya Model School apply online twreiscet.apcfss.in Ap Ekalavya Model School EMRS aptwgurukulam.ap.gov.in online application AP EMRS ONLINE APPLY
Peoples Motivation

ఏపీ ఏకలవ్య మోడల్‌ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

>> సీబీఎస్‌ఈలో బోధన..

>> ఫిబ్రవరి 19 వరకు గడువు..

Ekalavya Model School apply online twreiscet.apcfss.in Ap Ekalavya Model School EMRS aptwgurukulam.ap.gov.in online application AP EMRS ONLINE APPLY

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గిరిజన ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తారు.

ఏకలవ్య మోడల్‌ స్కూల్ ప్రత్యేకతలు

• సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరు నుంచి 12 తరగతి వరకు ఏకలవ్య పాఠశాలలు ఉంటాయి.

• ఒక్కో తరగతికి 60 (బాలురు 30, బాలికలు 30) మంది విద్యార్థులు ఉంటారు.

• విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆటస్థలం తదితర సౌకర్యాలు ఉంటాయి.

• బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో డార్మిటరీలు, ఆధునిక వంట గది, విశాలమైన భోజనశాల, క్రీడా ప్రాంగణం, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ.

• స్మార్ట్‌ విద్యాబోధనలో భాగంగా విద్యార్థులకు డిజిటల్, వర్చువల్‌ విధానంలో తరగతుల నిర్వహణ.

వయస్సు:-

ఆరో తరగతిలో ప్రవేశానికి 10 నుంచి 13 ఏళ్ల వయస్సు ఉండాలి.

అర్హతలు:-

ఈ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే బాలబాలికలు జిల్లాలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి. విద్యాహక్కు చట్టం 2009, సెక్షన్‌ 4 ప్రకారం విద్యార్థి ఇంటి వద్దనే అయిదో తరగతి చదివిన వారు కూడా అర్హులే. అయితే విద్యార్థి తల్లిదండ్రులు/సంరక్షకుడు డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు మాధ్యమంలో చదివిన వారూ రాత పరీక్షకు అర్హులే.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ఎలా:-

ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు twreiscet.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌లో విద్యార్థి వివరాలు నమోదు, పరీక్ష కేంద్రాలను కేటాయిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తయిన తరువాత ధ్రువపత్రాలు జతచేసి, పాస్‌పోర్టు సైజు ఫొటో అతికించి సమీపంలో ఉన్న ఏదైనా గురుకుల విద్యాలయంలో సంబంధిత ప్రిన్సిపల్‌కు అందజేసి రసీదు పొందాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటకుండా ఉండాలి. తెలుపు రంగు రేషను కార్డు ఉన్నవారు ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సిన అవసరం లేదు.

పాఠశాలల వివరాలు

జిల్లాలో గురుకులం ఆధ్వర్యంలో 17 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి.

రంపచోడవరం డివిజన్‌లో: రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, వై.రామవరం, మారేడుమిల్లి, చింతూరు.

పాడేరు డివిజన్‌లో: కొయ్యూరు, గూడెం కొత్తవీధి, డుంబ్రిగుడ, ముంచంగిపుట్ట, చింతపల్లి, పెదబయలు, అనంతగిరి, హకుంపేట, జి.మాడుగుల, అరకు, పాడేరు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం: 22-01-2025

దరఖాస్తు ముగింపు: 19-02-2025

అడ్మిట్‌ కార్డుల జారీ: తేదీ.22-02-2025

రాత పరీక్ష: 25-02-2025 (ఉదయం 11.30 గంటలనుంచి)

Comments

-Advertisement-