రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

స్వయం ఉపాధి పథకాల ఋణాల దరఖాస్తుల ఆహ్వానం

https://apobmms.apcfss.in APOBMMS AP SC Corporation loans apply Online OBMMS status BC Corporation loans AP bc corporation a.p. website Apcsf.gov.in
Peoples Motivation

స్వయం ఉపాధి పథకాల ఋణాల దరఖాస్తుల ఆహ్వానం

• బిసి, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు (కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి) కులాలకు అవకాశం 


2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బి.సి. కార్పోరేషన్, ఈబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు (కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి) కార్పోరేషన్లకు సంబంధించిన లబ్దిదారులకు బిసి కార్పోరేషన్, కర్నూలు వారి ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు గాను, దరఖాస్తుదారులు APOBMMS ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకొనుటకు తేదీ 30.01.2025 నుండి 07.02.2025 వరకు అవకాశం కల్పించబడినది.

బి.సి. కార్పోరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు (కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి) కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీ ఋణముల మంజూరుకు అవకాశం కలదు. 

నియమ నిబంధనలు:

• 21 నుండి 60 సం. ల మధ్య వయసు గలవారు బి.సి. మరియు ఇబిసి లు అర్హులు.

• కాపు (కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి) వారికి 21 నుండి 50సం. ల మధ్య వయసు గలవారు అర్హులు

• తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆదార్ కార్డు తప్పనిసరిగా కలిగి యుండవలెను.

• ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.

• వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును.

పై తెల్పిన విధంగా అర్హతలున్న వారు https://apobmms.apcfss.in వెబ్ సైట్ (ఆన్ లైన్) నందు తేదీ తేదీ 30.01.2025 నుండి 07.02.2025 లోగావారి పేర్లను APOBMMS వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవలసినదిగా ఇందుమూలముగా తెలియజేయడమైనది.

-కర్నూలు, పీపుల్స్ మోటివేషన్

Comments

-Advertisement-