Gold Rates: పైపైకి పసిడి ధరలు.. ఈ రోజు రికార్డు స్థాయిలో పెరుగుదల
Gold Rates: పైపైకి పసిడి ధరలు.. ఈ రోజు రికార్డు స్థాయిలో పెరుగుదల
Gold Rates: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లోనే దీనికి డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. మహిళలకు బంగారు ఆభరణాలు అలంకరణగా కూడా ఉంటాయి. అందుకే.. ఇవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అయితే ఇటీవల మాత్రం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ. 150 పెరగ్గా తులం రూ. 76,100 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర తాజాగా రూ. 170 పెరగ్గా 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 83,020 వద్ద ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేట్లు హైదరాబాద్ కంటే ఎక్కువగానే ఉంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు ఇందుకు కారణంగా ఉంటాయి. ఢిల్లీలో 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ. 76,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ. 170 ఎగబాకి తులం రూ. 83 వేల మార్కుకు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 96,500 వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 1.04 లక్షల వద్దే ఉంది. వెండి ధర ఢిల్లీ కంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
Petrol And Diesel Prices January 30th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.