మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోండి
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తెలుసుకోండి
>> ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదట
>> సిలిండర్ కన్నా గ్యాస్ స్టవ్ ఎత్తులో ఉండాలట
>> గ్యాస్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను తప్పక వాడుతుంటారు. ఇది ఎంత ఉపయోగకరమో.. అజాగ్రత్తగా వ్యవహరిస్తే అంతే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిలిండర్ ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
@ గ్యాస్ సిలిండర్ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డంగా పడుకోబెట్టకూడదని సూచిస్తున్నారు.
@ ఇంకా స్టవ్ను సిలిండర్ కంటే ఎత్తులో ఉంచి వంట చేయాలి.
@ గ్యాస్ను ఆన్ చేయడం, అగ్గి పుల్ల గీయడం లేదా లైటర్ అంటిచడం ఒకేసారి చేయాలి. ఆన్ చేశాక అగ్గి పుల్లని గీయకూడదు.
@ గ్యాస్ పైపులకు ఎలాంటి జాయింట్లు ఉండకూడదు. ఇంకా ఒక కనెక్షన్కు ఒక స్టవ్ను మాత్రమే వినియోగించాలి.
@ సిగరెట్లు, దీపాలు, కిరోసిన్ స్టవ్లు, లాంతర్లను సిలిండర్కు దూరంగా ఉంచాలి.
@ సిలిండర్ వినియోగించకపోతే గ్యాస్ ఉన్నా లేకున్నా.. మూత బిగించే ఉంచాలి. వినియోగిస్తున్నట్లైతే పని పూర్తవ్వగానే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.
@ @ముఖ్యంగా బయటకు వెళ్తున్నప్పుడు, రాత్రి పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేశామో లేదో ఓసారి చెక్ చేసుకుంటే మంచిది.
@ గ్యాస్ ట్యూబ్లు కంపెనీవి మాత్రమే వినియోగించాలి. వీటిని 4-5 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలి.
@వంట చేస్తున్న సమయంలో నూలు వస్త్రాలు, కాటన్ యాప్రాన్లనే ధరించాలి. ముఖ్యంగా స్టవ్ ఆన్లో ఉంచి ఇతర పనులు చేయకూడదు.
@ స్టవ్ లేదా కనెక్షన్ సమస్య వస్తే సొంతంగా రిపేర్ చేయకూడదు. సంబంధిత నిపుణులతో మాత్రమే రిపేర్ చేయించాలి.
@ ఇంకా మీకు సిలిండర్ను సరిగా అమర్చటం రాకుంటే సర్వీస్ మ్యాన్ లేదా డెలివరీ పర్సన్ సహాయం తీసుకోవాలి.
@ సిలిండర్ను గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశంలోనే పెట్టాలి. ఒకవేళ కిచెన్ కబోర్డ్లో ఉంచితే డోర్ దిగువ, పై భాగాల్లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
@ ఇంకా డెలివరీ సమయంలో గ్యాస్ సిలిండర్ సీల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
@ పిల్లలను ఎప్పుడూ వంటగదికి, ఎల్పీజీ సిలిండర్కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
@ ఒకవేళ ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ అయినట్లయితే కిటికీలను తెరచి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే LPG సప్లయర్ లేదా ఎమర్జెన్సీ సర్వీసులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.