Accreditation: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మూడు నెలల పొడిగింపు
అక్రిడిటేషన్: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మూడు నెలల పొడిగింపు
కర్నూలు, ఫిబ్రవరి 27 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని మూడు నెలల పాటు అనగా మార్చి 1, 2025 31.05.2025 నుండి లేదా కొత్త కార్డులు జారీ చేయడం లేదా ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపుకు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీచేసినట్లు కర్నూలు సమాచార శాఖకు ఐపీఆర్వో జయమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు జిల్లాలో ప్రస్తుతం ఫిబ్రవరి 28, 2025 నాటికి అక్రిడిటేషన్ కార్డులు వాలిడిటీ కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే మార్చి 1, 2025 నుండి 31.05.2025 వరకు పొడిగింపు ఆశాజనకంగా కొనసాగుతుందని, సంబంధిత మీడియా యాజమాన్యం వారి సంస్థలో పని చేయుచున్నది, జర్నలిస్టుల వివరాల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, కర్నూలు వారి అందజేయాలని డిఐపిఆర్వో ఓ ప్రకటనలో తెలియజేశారు.
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు మూడు నెలల పొడిగించిన ఉత్తర్వులు👇👇
https://drive.google.com/file/d/1eyo9_QXaaS4wXppIIEFMRe-Th540Kf03/view?usp=drivesdk