NCET: 4 ఏళ్లలో డిగ్రీ+బీఈడీ కోర్సులో ప్రవేశాలు.. పూర్తి వివరాలు
NCET: 4 ఏళ్లలో డిగ్రీ+బీఈడీ కోర్సులో ప్రవేశాలు.. పూర్తి వివరాలు
ఎన్‌టీఏ 4 ఏళ్లలో డిగ్రీ+బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభు, ప్రైవేట్ కళాశాలల్లో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఇంగ్లిష్, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) 2025 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 6,100 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లు కల్పిస్తరాఉ. ఆయా సంస్థలు కౌన్సెలింగ్ నిర్వహించి బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సుల్లో సీట్లను కేటాయిస్తాయి.
అర్హతలు:
ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 16, 2025వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1200, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.650 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
సీట్ల వివరాలు..
ఎన్‌సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 64 ఆర్‌ఐఈ, ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ సంస్థల్లో మొత్తం 6,100 సీట్లు అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ ఉర్దూ వర్సిటీ 150 సీట్లు, వరంగల్ ఎన్‌ఐటీ లో 50 సీట్లు, లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 50 సీట్లు, ఆంధ్రప్రదేశ్.. తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో (50 సీట్లు), శ్రీకాకుళం డా బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 100 సీట్ల చొప్పున ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 16, 2025.
దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 18, 19 తేదీల్లో..
సిటీ ఇంటిమేషన్ స్లిప్ వెల్లడి: ఏప్రిల్ మొదటి వారం
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: పరీక్షకు 3, 4 రోజుల ముందు నుంచి
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పరీక్ష తేది: ఏప్రిల్ 29, 2025.