APPSC: గ్రూప్ 2 పరీక్షలు రాసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ..
APPSC: గ్రూప్ 2 పరీక్షలు రాసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కార్యదర్శి విజయవాడ, APPSC కమిషన్ గ్రూప్- 11 మెయిన్స్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ రకం) (నోటిపికేషన్ నంబర్ 11/2023) 23.02.2025 న ఆఫ్-లైన్/ OMR లో ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.30 వరకు (పేపర్-1) మరియు మధ్యాహ్నం 3.00 నుండి సాయంత్రం 5.30 వరకు (పేపర్-II) ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేసినది. మొత్తం 905 పోస్టులకు (నోటిఫికేషన్ నెం.11/2023) 13 జిల్లాల్లో 92,250 అభ్యర్ధులు హాజరవుతున్నారు. కర్నూలులో 9,993 మంది అభ్యర్ధులు మెయిన్స్ పరీక్షకు హాజరవుతున్నారు. కర్నూలులో 30 సెంటర్లు ఖరారు చేయబడ్డాయి.
ఏపీపీఎస్సీ ఈ క్రింది విధంగా అభ్యర్ధులకు సూచనలు జారీ చేసింది:
> హాల్ టికెట్ మరియు ఒరిజినల్ ఫోట్ ఐ.డి. i.c. పాస్పోర్ట్. పాన్కార్డ్. ఓటరు ఐడి, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటి ధృవీకరణ తర్వాత అభ్యర్థులను ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.30 నుండి ఉదయం 9.30 వరకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ అంటే, ఉదయం 9.45 వరకు, మధ్యాహ్నం 1.30 నుండి మధ్యాహ్నం 2.30 వరకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ అంటే 2.45 వరకు, గ్రేస్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఏ అభ్యర్థినీ అనుమతించకూడదు. పూర్తి సమయం ముగిసి వరకు ఏ అభ్యర్థిని ఎగ్జామినేషన్ హాల్ నుండి బయటకు అనుమతించకూడదు.
> ఒక వేళ అభ్యర్థులు సంతకం లేకుండా ఫోటో/ అస్పష్టమైన ఫోటో/ చాలా చిన్న ఫోటో/ ఫోటో లేకుండా హాల్ టికెట్ అందుకుంటే, గెజిటెడ్ అధికారి ధృవీకరించిన 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలని మరియు అభ్యర్ది హాల్ టికెట్ మరియు నామినల్ రోల్ లో అతికించడానికి ఎగ్జామినేషన్ హాల్లోని ఇన్విజిలేటర్ కు అప్పగించాలని ఆదేశించారు. ఇది విఫలమైతే అభ్యర్థి పరీక్షకు అనుమతించబడరు. అభ్యర్ధులు టాబ్లెట్లు, ఐ-ప్యాడ్లు, రైటింగ్ ప్యాడ్లు, హ్యాండ్ బ్యాగ్లు, ఏదైనా పీపర్లు, పుస్తకాలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ మరియు డిజిటల్ వాచ్, కాలిక్యులేటర్లు (ఏదైనా మోడ్) మరియు ఇంటరాక్ట్ ప్రోగ్రామింగ్ చేయగల ఇతర పరికరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా హాల్ కు నిషేధించబడింది. అనలాగ్ మణికట్టు గడియారాలు మాత్రమే అనుమతించబడతాయి. తీసుకురావడం
> ప్రతి అభ్యర్థి తన ప్రశ్నపత్రం సిరీస్ ను వ్రాసి, OMR జవాబు పత్రంలో మాత్రమే బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో నిర్దేశించిన ప్రదేశంలో సర్కిల్ ను బబుల్ చేసేలా చూసుకోవాలి.
> అంధత్వం, లోకోమోటర్ వైకల్యం (రెండు చేతులు లేని వారు) మరియు సెరిబ్రల్ పాల్సీ విభాగంలో బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తుల విషయంలో, వ్యక్తి కోరుకుంటే, లేఖరి/రీడర్/ ల్యాబ్ అసిస్టెంట్ సౌకర్యం ఇవ్వబడుతుంది. బెంచ్ మార్క్ వైకల్యాలున్న ఇతర వర్గాల వ్యక్తుల విషయంలో, సంబంధిత వ్యక్తికి వ్రాయడానికి లేఖరి/ రీడర్ / ల్యాబ్ అసిస్టెంట్ ను అనుమతించవచ్చు. శారీరక పరిమితి ఉందని దృవీకరణ పత్రాన్ని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సంస్థ యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్/సివిల్ సర్జన్/మెడికల్ సూపరింటెండెంట్ నుండి సమర్పించవలెను.
> ఒకవేళ అభ్యర్ది తన సొంత లేఖకుడిని తీసుకురావడానికి అనుమతించబడితే, లేఖరి యొక్క అర్హత పోస్టుకు సూచించిన అర్హత కంటే తక్కువగా ఉండాలి.
> గ్రూప్-11 మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాలకు అభ్యర్ధులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరుకోవడంలో సహాయపడటానికి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయములో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడమైనది. అభ్యర్ధులు ఉదయం 10.00 గం.. నుండి సాయంత్రం 5.00 వరకు ల్యాండ్ లైన్ నెంబర్ 08518-277305 కు కాల్ చేయవచ్చును.