బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.. 18 ఎంజేపీఏపీబీసీ సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఇంటర్మీడియట్ (ఇంగ్లిష్ మీడియం) కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువరించింది.
మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీ ఆర్ జేసీ సెట్-2025
• బాలుర జూనియర్ ఇంటర్ సీట్లు: 1340
• బాలికల జూనియర్ ఇంటర్: 1340
అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.08.2025 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
ఆదాయం: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకుమించకూడదు.
పరీక్షా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్లోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ కళాశాలల్లో
సీట్ల కేటాయింపు: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.250.
ఆన్లైన్ దరఖాస్తుకు గడువు: 15.03.2025.
ప్రవేశ పరీక్ష: 20.04.2025.
అధికారిక వెబ్సైట్: https://mjpapbcwreis.apcfss.in/