ఎస్సీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ ల ద్వారా రుణాల వివరాలు
ఎస్సీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ ల ద్వారా రుణాల వివరాలు
మెరుగైన జీవనోపాధుల కల్పనే లక్ష్యం
చిత్తూరు, ఫిబ్రవరి 01 (పీపుల్స్ మోటివేషన్):- జిల్లాలో ఎస్‌సి, బిసి, బిసి, మైనారిటీలకు మెరుగైన జీవనోపాధుల కల్పనలో ఎస్సై, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా విరివిగా ఋణాలు పొందాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బ్యాంకర్లకు సూచించారు.
శనివారం ఎస్సీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు పై శాఖ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపి డి ఓ లు, బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సి, బిసి, మైనారిటీల జీవోపాధులు మెరుగుపడడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, బిసి కార్పొరేషన్ కింద అర్హత ఉన్న ఈబిసి, కమ్మ, రెడ్డి, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాల వారికి 50 శాతం సబ్సిడీ కింద రూ. జరుగుతాయి. బిసి కార్పొరేషన్ ద్వారా 2,80 యూనిట్లకు సబ్సిడీ కింద రూ.61.25 కోట్లు రుణాలు, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా 916 క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలకు రూ.14 కోట్లు ఇస్తున్నారు.
బి సి కార్పొరేషన్ ల ద్వారా రుణాల మంజూరుకు రుణాల మంజూరు ప్రక్రియ ప్రారంభం అయిందని, వయస్సు కొరకు కుల ధృవీకరణ, రేషన్ కార్డు, వయసు, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ కలిగిన వారు 30 జనవరి 2025 నుండి 07 ఫిబ్రవరి 2025 లోపు సచివాలయాల పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో https://apobmms.dev.nidhi.apcfss.in/ వెబ్ సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.
ఎస్ సి,మైనారిటీ కార్పొరేషన్ ద్వారా త్వరలో సబ్సిడీతో యూనిట్లకు ఎంపీడీఓలు సన్నద్ధం కావాలని బ్యాంకర్లు కూడా సహకరించాలన్నారు.
ఈ సమావేశంలో ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య మైనారిటీ కార్పొరేషన్ ఈడీ హరినాథ రెడ్డి, ఎల్ డి ఎం హరీష్ ఉత్తర బ్యాంకుల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.