పెళ్లిలో డ్యాన్స్ చేసిన వరుడు.. పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి
పెళ్లిలో డ్యాన్స్ చేసిన వరుడు.. పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి
• పెళ్లిలో సరదాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వరుడు..
• షాక్ ఇచ్చిన వధువు తండ్రి..
• ‘చోళీ కే పీచే క్యా హై’ సాంగ్‌కు వరుడు డ్యాన్స్ చేయడంపై ఆగ్రహం..
విస్తూపోయే ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పెళ్లికుమారుడు తన కుటుంబం, బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే సరదాగా డ్యాన్స్ చేయాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. పెళ్లిలో సరదాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వరుడికి వధువు తండ్రి షాక్ ఇచ్చాడు. ‘చోళీ కే పీచే క్యా హై’ సాంగ్‌కు వరుడు డ్యాన్స్ చేయడంపై ఆగ్రహం చెందాడు. దీంతో పెళ్లిని రద్దు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘చోలీ కే పీచే క్యా హై’ సాంగ్ ప్లే చేయడం, ఫ్రెండ్స్ డ్యాన్స్ చేయడంతో వరుడు కూడా వారితో కలిశాడు. ఆ పాటకు తగ్గట్టుగా హావభావాలతో డ్యాన్స్ చేశాడు.
కాగా, వరుడి డ్యాన్స్ చూసి వధువు తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు. పెళ్లి తంతును వెంటనే ఆపించాడు. పెళ్లికొడుకు చర్యల వల్ల తమ కుటుంబ విలువలకు అవమానం జరిగిందని ఆరోపించాడు. పెళ్లిని రద్దు చేశాడు. మరోవైపు పెళ్లి ఆపేయాలన్న తండ్రి నిర్ణయంతో పెళ్లికూతురు ఏడ్చింది. ఆమె తండ్రికి నచ్చజెప్పేందుకు వరుడు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పెళ్లి రద్దు చేసిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలాగే పెళ్లికొడుకు, అతడి కుటుంబంతో మాట్లాడవద్దని, వారిలో ఎలాంటి సంబంధాలు వద్దని తన కుమార్తెకు తెగేసి చెప్పాడు. కాగా, ఈ వార్తకు సంబంధించిన పత్రిక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొందరు నెటిజన్లు సీరియస్‌గా, మరికొందరు ఫన్నీగా స్పందించారు.