Budget: రూ.2,010 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ పనులకు క్యాబినెట్ ఆమోదం
Budget: రూ.2,010 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ పనులకు క్యాబినెట్ ఆమోదం
- రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
అమరావతి, ఫిబ్రవరి 28: జల్ జీవన్ మిషన్ క్రింద రూ.2,010 కోట్ల విలువైన 7,797 పనులను చేపట్టేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఈ పనులన్నింటినీ తొమ్మిది మాసాల కాలంలో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా నిర్థేశించడం జరిగిందన్నారు. శుక్రవారం రాష్ట్ర శాసన సభ మీడియా పాయింట్ వద్ద మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అభివృద్ది, సంక్షేమం మద్య సమతుల్యత ప్రతిబింబించే విధంగా నేడు వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశ పెట్టడమైందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకు రూ. 28 వేల కోట్లను ఫించన్లకు వెచ్చించడం జరుగుచున్నదన్నారు. గత ప్రభుత్వంలోని నాయకులు ఢిల్లీకి లెక్కలేనన్నిసార్లు వెళ్లి ఏం సాధించారో చెప్పలేని పరిస్థితి నెలకొందని, అయితే కూటమి ప్రభుత్వం అమరావతి పోలవరం ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడంలో సఫలీకృతమైందన్నారు. కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తూ పెట్టుబడులు ఆకర్షించేలా కృషి చేస్తుందని, అయితే గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విశ్వసనీయతను కోల్పోవడమే కాకుండా పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని కూడా గత ప్రభుత్వం కోల్పోయిందన్నారు.
గృహ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం యూనిట్ కాస్టుగా రూ.1,80,000 చెల్లిస్తే ప్రస్తుతం యూనిట్ కాస్ట్ ను రెండు లక్షల 50 వేలు గా నిర్ణయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీలకు 50 వేల రూపాయలు, ఎస్టీలకు 75 వేల రూపాయలు, బీసీలకు లక్ష రూపాయలు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెల్పిందన్నారు. గత ప్రభుత్వం చెల్లించిన రూ.1,80,000 లో కూడా రూ.30 వేలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి మిగిలిన మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచే ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్ళనిర్మానాన్ని పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదన్నారు. గత ప్రభుత్వం పేదవారికి పెత్తందారులకు పోటీ అని ఎన్నికల ముందు చెప్పి ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇచ్చే గృహ నిర్మాణ వ్యయాన్ని రద్దు చేసిందన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలకు సంబంధించి ఇంకా రాష్ట్రంలో 5.5 లక్షల గృహాలు మొదలు కావాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, యూనిట్ కాస్ట్ తక్కువగా ఉండటం, సిమెంటు ధరలు, అదనపు భారము తదితర కారణాలుగా నిర్మాణాలు అనుకున్న విధంగా పూర్తి చేయలేక పోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పేదల పక్షాన నిలబడటమే కాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణ పూర్తికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇళ్ళ నిర్మాణానికి అదనపు సాయం అందించటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 4,135 కోట్ల భారం పడిందన్నారు.
వైసీపీ నాయకులు రాష్ట్రం కోసం పనిచేయటం లేదని, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండా ప్రతిపక్ష హోదా కోసం ఒక నాయకుడు మెప్పుకోసం పనిచేస్తున్నారన్నారు. దేశంలో మొదటిసారిగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగటం ఇదే మొదటిసారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడటం వైసిపి డిఎన్ఏ లోనే లేదన్నారు. సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై భారాన్ని మోపిందన్నారు. సంక్షేమం పేరుతో నిధులను దారి మళ్ళించిందన్నారు.
