రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Budget: మైనార్టీల సంక్షేమానికి రూ.5434 కోట్ల భారీ బడ్జెట్

Andhra pradesh to present budget for 2025-26 Ap budget 2025 26 telugu AP Budget pdf AP Budget Highlights Ap Budget portal Ap Finance Budget Ap Budget
Peoples Motivation

Budget: మైనార్టీల సంక్షేమానికి రూ.5434 కోట్ల భారీ బడ్జెట్

మైనారిటీల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వు

మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణం

గత ఏడాది బడ్జెట్ కంటే రూ. 1058 కోట్లు అదనం

సబ్ ప్లాన్ అమలు ద్వారా మైనార్టీల అభ్యున్నతికి కృషి

గత ప్రభుత్వంలో మైనారిటీలకు అడుగడుగునా మోసమే

2025-2026 వార్షిక బడ్జెట్ పై మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రశంసల జల్లు

సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి కేశవ్ కు కృతజ్ఞతలు

Andhra pradesh to present budget for 2025-26 Ap budget 2025 26 telugu AP Budget pdf AP Budget Highlights Ap Budget portal Ap Finance Budget Ap Budget

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఆంధ్రప్రదేశ్ 2025-2026 సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి రూ. 5434 కోట్లు కేటాయించడంపై రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించడమే ఇందుకు నిదర్శనమని శుక్రవారం అమరావతిలో విడుదల చేసిన ప్రకటనలో మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో మైనార్టీలకు అడుగడుగునా మోసమే ఎదురైందని, మైనార్టీ వర్గాలను మభ్యపెట్టి అప్పటి ప్రభుత్వం సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన బడ్జెట్ మొత్తాన్ని ప్రకటించడం తో మైనార్టీల ముఖాల్లో మళ్ళీ చిరునవ్వు చిగురిస్తున్నదని అన్నారు.

అదనంగా రూ.1058 కోట్లు

మైనార్టీల అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కంకణబద్ధంగా కృషి చేస్తున్నదని,2024-2025 బడ్జెట్లో రూ. 4376 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత 2025-2026 బడ్జెట్లో అదనంగా రూ. 1058 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు. మైనారిటీ సబ్ ప్లాన్ ద్వారా ఇతర శాఖల ద్వారా మైనార్టీలు లబ్ధి పొందేందుకు వీలుగా సబ్ ప్లాన్ కు రూ. 2512 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.2024-2025 బడ్జెట్ లో మైనారిటీ సబ్ ప్లాన్ అమలకు రూ. 1568 కోట్లు కేటాయించడం జరిగిందని, ప్రస్తుత బడ్జెట్లో అదనంగా రూ. 944 కోట్లు బడ్జెట్ కేటాయించడం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టం అవుతున్నదని పేర్కొన్నారు.

నిలిపివేసిన పథకాల పునరుద్ధరణ

2014-2019 టిడిపి ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమ పథకాలన్నిటిని నిలిపివేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన పథకాలను తిరిగి పునరుద్ధరించి కార్యాచరణ బద్ధంగా శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇమాములు, మౌజాన్లకు నిలిపివేయబడిన గౌరవ వేతనాలకు సంబంధించి 2024-2025 ఆర్థిక సంవత్సరంకు రూ.45 కోట్లు చెల్లింపులు కూడా చేశామని పేర్కొన్నారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత

ప్రస్తుత బడ్జెట్లో ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కోసం రూ.560 కోట్లు, ముస్లిం మైనార్టీల స్వయం ఉపాధి, ఆర్థిక భరోసా కు రూ. 173.57 కోట్లు, ఆర్టిఎఫ్ అండ్ ఎండిఎఫ్ కు రూ. 229 కోట్లు, డాక్టర్ ఏపీజే కలాం ఓవర్సీస్ పథకానికి రూ. 20 కోట్లు,రూ. 90 కోట్లు ను ఇమాములు, మౌజనులకు వేతనాలకు, హజ్ యాత్రికుల కు రూ. 14 కోట్లు, ఉర్దూ అకాడమీకి రూ.10.80 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే క్రైస్తవ మైనారిటీల ఉపాధి ఆర్థిక చేయూత కోసం రూ. 20 కోట్లు,రూ. 30.49 కోట్లు పాస్టర్లకు కేటాయించడం జరిగిందన్నారు. జెరూసలేం యాత్రికులకు రాయితీ కోసం రూ. 1.50 కోట్లు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి రూ. 1.50 కోట్లు, ఆర్టిఎఫ్ అండ్ ఎంటిఎఫ్ కు రూ. 12 కోట్లు మొత్తాన్ని ప్రధానంగా కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న హజ్ భవనాల పూర్తి, మసీదులు,ఈద్గాలు, శాదిఖానాలు, చర్చిలు తదితర వాటికి మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

సబ్ ప్లాన్ ద్వారా మరింత లబ్ది

మైనారిటీ సబ్ ప్లాన్ అమలు ద్వారా ఇతర శాఖల ద్వారా మైనార్టీలకు మరింత మేలు చేకూరుతుందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం 2024-205 ఆర్థిక సంవత్సరంలో రూ. 2808.75 కోట్లు బడ్జెట్లో కేటాయించగా, ప్రస్తుత 2025-2026 బడ్జెట్లో అదనంగా రూ. 112.70 కోట్లు కేటాయించి మొత్తం రూ. 2921.98 కోట్లు మొత్తంతో మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేసిందని అన్నారు. మైనారిటీ సబ్ ప్లాన్ ద్వారా రూ. 2512.98 కోట్లు, మైనార్టీ సంక్షేమ విభాగం ద్వారా రూ. 2921.45 కోట్లు, మొత్తం రూ. 5434.43 కోట్లు బడ్జెట్ తో 2025-2026 వార్షిక ప్రణాళిక అమలు చేయబోతున్నామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చి నిధుల కేటాయింపు చేయడంపై మైనార్టీ వర్గాల ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు మైనార్టీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.

Comments

-Advertisement-