E-Waste: ఈ- పాత సామాన్లను ఆన్లైన్ వస్తువులు విక్రయించే అవకాశం
E-Waste: ఈ- పాత సామాన్లను ఆన్లైన్ వస్తువులు విక్రయించే అవకాశం
• వ్యర్థాలతో ఇళ్లను నింపేయొద్దు
• ఆన్లైన్ పోర్టల్లో పాత వస్తువులు విక్రయించే అవకాశం
పీపుల్స్ మోటివేషన్:-
ఈ రోజుల్లో మొబైల్, ఏసీ, టీవీ.. ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్కు అయినా చిన్న చిన్న సమస్యలు వస్తే చాలామంది కొత్తవి కొనేసుకుంటున్నారు. పాడై నవి, పాతవి ఇంట్లో ఏదో ఒక మూలకు చేరిపో తున్నాయి. యూరప్ లో ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం సగటున ఒక్కో ఇంటిలో 74 ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్లుగా వెల్లడైంది. వాటిలో పాత హెడ్ఫోన్లు, రిమోట్లు, గడియా రాలు, ఐరన్బాక్సులు, హార్డ్ డ్రైవ్లు, కీ బోర్డులు, మౌస్లు, మొబైళ్లే ఎక్కువ, భారత్లోనూ గత ఐదేళ్లలో ఈ-వ్యర్ధాలు 72.47% పెరిగినట్లు అంచనా. పొడైన, మనం వాడకుండా వదిలేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్లైన్ ప్లాట్ఫామ్లలపై విక్రయించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవడమూ దీనికి ఒక కారణం.
ఇదిగో ఇలా విక్రయించొచ్చు...!
ఫ్లిప్కార్ట్లో ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టి నప్పుడు సంస్థ మొదట ధరను నిర్ణయిస్తుంది. సంస్థ ప్రతినిధులు వచ్చి వస్తువును పరిశీలించి కొనుగోలు చేస్తారు. వస్తువు నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు విక్రయించొచ్చు. 'క్యాషిఫై' ద్వారా కూడా ఫోన్లు, ట్యాబ్లు, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ వాచ్లు, టీవీలు, ఐమాక్స్లు, కెమెరాలు, ఏసీలు విక్రయించొచ్చు. వీటి మోడల్ ఆధారంగా పోర్టల్ ఆటోమెటిక్గా నిర్ణయిస్తుంది. సంస్థ ప్రతినిధులు పరీక్షించిన పుడు లోపాలున్నట్లయితే ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎక్స్చేంజ్లో పాత వస్తువులు పెట్టి కొత్త వస్తువుల కొనుగో లులో ధర తగ్గించుకోవచ్చు. ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో (మిగతా 2లో)పాత వస్తువుల ధరలను మనమే నిర్ణయించి అప్లోడ్ చేయొచ్చు. ఆసక్తిగల వారు వచ్చి ధర నిర్ణయించి తీసుకెళ్లే వెసులుబాటు ఈ సంస్థలు కల్పిస్తున్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
మొబైల్ను అమ్మాలనుకుంటే అందులో వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా తొలగించాలి. ఇందుకోసం ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. 'ఫైన్డ్ మై ఫోన్ ఆప్షన్' డిజెబుల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తులకు, సంస్థ లకు విక్రయిస్తే సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదముంది.
భారత్లో ఈ-వ్యర్థాల పెరుగుదల..
భారత్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) ఉత్పత్తి ఏటా గణనీయంగా పెరుగుతోంది. 2019-20లో 1.01 మిలియన్ టన్నులుగా ఉన్న ఈ-వేస్ట్ 2023-24 నాటికి 72.54 శాతం పెరిగిందని అంచనా. 2022-235 సుమారు 33 శాతం ఈ-వేస్ట్ రీసైకిల్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నా ఇంకా పెరగాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇతర దేశాల్లో ఇలా..
అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో ఈ-వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ప్రజలకు అందు బాటులో ఉంటాయి. యురోపియన్ యూనియన్లో వేస్ట్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రా నిక్ ఎక్విప్మెంట్ ప్లాట్ఫామ్ల ద్వారా వివిధ కంపెనీలు తాము విక్రయిం చిన ఎలక్ట్రానిక్ వస్తువులను తిరిగి తీసుకుని పునర్వినియోగానికి ఉపయోగి స్తున్నాయి. యాపిల్, శాంసంగ్, డెల్ కంపెనీలు పాత పరికరాలు తీసుకుని కొత్త వస్తువులపై తగ్గింపును అందిస్తున్నాయి. యూరప్లో ఎలక్ట్రానిక్ పరిక రాల మరమ్మతులను వినియోగదారుల హక్కుగా చట్టాన్ని అమలు చేస్తు న్నారు. కంపెనీలు పర్యావరణ హితమైన, దీర్ఘకాలికంగా పని చేసే పరికరాలు తయారు చేయడం ఇక్కడ తప్పనిసరి.