రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Fire: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

trending post trendingnews viralposts viral news trendingnow trendingfashion trendingtopic trendings intresting facts Intersting news Viral news facts
Peoples Motivation

Fire: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

• ఫేస్ 1లో ఓ కంపెనీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..

• ఇతర కంపెనీలకు లకు అంటుకున్న మంటలు..

• మంటలు చెలరేగడంతో భయాందోళనలో స్థానిక ప్రజలు..

• రహదారి పక్కనే ఉండడంతో దట్టంగా కమ్ముకున్న పొగలు..


హైదరాబాద్​ శివారు ప్రాంతంలోని చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫేస్ 1లోని శేషసాయి రసాయన పరిశ్రమలో కెమికల్ డ్రమ్ములు పేలి మంటలు అంటుకున్నాయి. మంటల తీవ్రత భారీగా ఉంది. వరుసగా రసాయనాలు నిల్వ చేసిన డ్రమ్ములు పేలుతుండటంతో ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. మంటల తీవ్రత అధికమై చుట్టుపక్కల ఉన్న మహాలక్ష్మీ రబ్బరు కంపెనీతో సహా మరో 2 పరిశ్రమలకు వ్యాపించాయి. మంటల తీవ్రతతో మరిన్ని పరిశ్రమలకు కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఆకాశంలో నల్లని పొగకు తోడు, రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాప్తిస్తుండటంతో ఇతర ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నారు. ఈ ప్రమాదంతో హిందుస్థాన్ కేబుల్​కు, చర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. మరోవైపు మంటల వల్ల ఈసీఐఎల్, హిందుస్థాన్ కేబుల్స్, మౌలాలి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. ప్రమాద స్థలంలో స్వయంగా సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రాణనష్టం ఏమీ జరగలేదని ప్రాథమిక సమాచారం. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments

-Advertisement-